Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకృష్ణుడికి తులసి అంటే అంత ప్రేమ ఎందుకో..? రుక్మిణీ, సత్యభామల తులాభారంలో?

దైవారాధనకు తగిన మొక్కల్లో ''తులసి''దే అగ్రస్థానం. శ్రీ మహా విష్ణువు పాదాల చెంత సేవ చేసే పతీవ్రతా దేవికి ''తులసి'' అనే పేరుంది. తులసిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు. తులసీ మొక్కను స్నానమాచరించకుండా

Advertiesment
Tulsi
, మంగళవారం, 8 మే 2018 (12:26 IST)
దైవారాధనకు తగిన మొక్కల్లో ''తులసి''దే అగ్రస్థానం. శ్రీ మహా విష్ణువు పాదాల చెంత సేవ చేసే పతీవ్రతా దేవికి ''తులసి'' అనే పేరుంది. తులసిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు. తులసీ మొక్కను స్నానమాచరించకుండా ముట్టుకోరాదు. శ్రీకృష్ణుడిపై సత్యభామ, రుక్మిణీలపై సమానమైన ప్రేమను వుంచాడు. కానీ రుక్మిణీ దేవి కృష్ణుడిపై హద్దుల్లేని ప్రేమను.. తరగని భక్తిని కలిగివుండేది. 
 
అంతేగాకుండా శ్రీకృష్ణుడిని తన మదిలో వుంచుకుని పూజించేది. కానీ సత్యభామ శ్రీకృష్ణుడు తన వాడేనని.. భారీ సంపదతో నారదుని సహాయంతో శ్రీకృష్ణుడిని సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఇందుకోసం శ్రీ కృష్ణభగవానుడు తులాభారం నిర్వహించేందుకు సిద్ధమవుతాడు. తులాభార త్రాసులో ఓ వైపు శ్రీకృష్ణుడు కూర్చుంటాడు. మరో త్రాసులో సత్యభామ తన సంపదను వుంచుతుంది. 
 
కానీ శ్రీకృష్ణుడి బరువుకు ఆ సంపద సరితూగలేదు. ఆ సమయంలో రుక్మిణీ దేవి వద్ద అంత సంపద లేదని బాధతో.. శ్రీకృష్ణుడికి ఇష్టమైన తులసీ దళాన్ని త్రాసు పళ్లెంలో వుంచుతుంది. తులసీ దళం శ్రీకృష్ణుడి బరువు సమతూగింది. ఆ సమయంలో తాను ఎవరికి సొంతమో సత్యభామకు ఇప్పుడు అర్థమై వుంటుందని శ్రీకృష్ణుడు తెలిపాడు. అహంకారం లేని చోట, నిజమైన భక్తితో తనను శరణు వేడుకునే వారికి తాను సొంతమవుతానని చెప్పాడు. 
webdunia
 
ఆ సమయంలో తన తప్పును తెలుసుకున్న సత్యభామ కన్నీటితో శ్రీకృష్ణుని పాదాలను శరణు వేడుకుంది. ఆ తులసీ దళాన్ని తన శిరోజాల్లో ధరించింది. అలాంటి పవిత్రమైన తులసీ మొక్కను రోజూ పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. శుచిగా స్నానమాచరించి తులసీ కోట వద్ద ఉదయం సాయంత్రం దీపమెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మీదేవిల అనుగ్రహం పొందుతారు.

ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇక శుక్రవారం పూట, మంగళవారం పూట తులసీ దళాలను తుంచటం చేయకూడదని వారు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నారులకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులుంటే?