50 సంవత్సరాల తర్వాత జ్యోతిష్యం ప్రకారం అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. 50 ఏళ్ల తర్వాత గురు గ్రహాన్ని ప్రత్యక్షంగా సూర్యుడు ఎదుర్కోనున్నారు. అంటే గురువును సూర్యుడు నేరుగా చూస్తున్నాడు. ఈ అరుదైన కలయిక ద్వారా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది.
గురు, సూర్యుని కలయిక ద్వారా కొన్ని రాశులకు అదృష్టం వరిస్తుంది. తద్వారా ఆ రాశుల వారు కోటిశ్వరులు అయ్యే అవకాశం వుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సూర్యుడు, గురు కలయిక వల్ల త్రి ఏకాదశ యోగం ఏర్పడనుంది. వేద జ్యోతిష్యం ప్రకారం త్రి ఏకాదశ యోగం ఏర్పడింది. సెప్టెంబర్ 12వ తేదీ త్రి ఏకాదశ యోగం ఏర్పడనుంది. ఇరు గ్రహాలు ప్రత్యక్షంగా 60 డిగ్రీల కోణంలో అమరియుంటాయి. తద్వారా ఈ యోగం ఏర్పడుతుంది.
త్రి ఏకాదశ యోగంతో మిథున రాశి వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారం, ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆర్థికాభివృద్ధి వుంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. రుణం చెల్లిస్తారు. బకాయిలు చెల్లింపులతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెట్టుబడులకు అనుకూలం. సంతానం ద్వారా శుభం కలుగుతుంది. ఇంటా శుభ కార్యాలు జరుగుతాయి. మానసిక ఉల్లాసం చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.
త్రి ఏకాదశ యోగంతో సింహ రాశి వారికి మంచి ఫలితాలుంటాయి. ఈ కాలంలో ఆదాయం బాగుంటుంది. ఆర్థిక వృద్ధి కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారంలో రాణించి లాభం గడిస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. జీవితంలో రాణించేందుకు కఠినంగా శ్రమిస్తారు.
ఈ క్రమంలో త్రి ఏకాదశ యోగంతో ధనుస్సు రాశి వారికి సర్వాభీష్టాలు చేకూరుతాయి. వీరికి అద్భుత ఫలితాలు చేకూరుతాయి. ధనాదాయం ఏర్పడుతుంది. మెరుగైన ఉద్యోగవకాశాలు చేకూరుతాయి. కార్యాలయాల్లో గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ దక్కే అవకాశం వుంది. పారిశ్రామిక వేత్తలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య జీవనం సుఖమయం అవుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. డబ్బును ఆదా చేయడంలో విజయవంతం అవుతారు.