Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Skanda Sashti 2021: ఈ రోజున ఉపవాసంతో ఎంత మేలో తెలుసా?

Skanda Sashti 2021: ఈ రోజున ఉపవాసంతో ఎంత మేలో తెలుసా?
, బుధవారం, 16 జూన్ 2021 (08:49 IST)
Lord Muruga
ఉపవాసాలకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెల శుక్ల పక్షం యొక్క ఆరవ రోజున స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు స్కందశక్తి. అంటే జూన్ 16న శివుడి కుమారుడు కార్తికేయ పూజలు చేస్తారు. కార్తికేయ స్కంద షష్ఠి రోజున జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున కార్తికేయను ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. 
 
నెయ్యి దీపం వెలిగించి పువ్వులు, పండ్లు సమర్పించవచ్చు. ఈ రోజంతా ఉపవసించి.. పండ్లు తింటూ సాయంత్రం పూజ తర్వాత ఆహారం తీసుకోవాలి. స్కందశక్తి పూజ చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. జాతకంలో ఎలాంటి గ్రహ లోపాలు ఉన్నా స్కంధుడిని షష్ఠి రోజున పూజించే వారికి మంచి ఫలితాలు చేకూరుతాయి. ఈ పండుగను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జరుపుకుంటారు. దక్షిణాన కార్తికేయ భగవంతుడిని సుబ్రహ్మణ్యా అని పిలుస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-06-2021 బుధవారం దినఫలాలు - నవదుర్గాదేవిని ఆరాధించినా...