Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైత్ర పూర్ణిమ.. చిత్రగుప్తుడిని దర్శించుకుంటే..? అన్నదానం చేసినట్లైతే..?

చైత్ర పూర్ణిమ.. చిత్రగుప్తుడిని దర్శించుకుంటే..? అన్నదానం చేసినట్లైతే..?
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (17:41 IST)
ChirtaGupta
సోమవారం చైత్ర పూర్ణిమ. పౌర్ణమి వ్రతం. చైత్ర పూర్ణిమ సోమవారం (ఏప్రిల్ 26, 2021)న వస్తోంది. ఈ రోజున సత్య నారాయణ వ్రతం ఆచరించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ పూర్ణిమ నాడు శివకేశవులను  పూజించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 
 
ఈ రోజున చంద్రుడు పూర్ణ బిందువుగా ప్రకాశిస్తాడు. భూమికి సమీపంలో వుంటారు. చైత్ర పౌర్ణమి రోజున శివునిని పూజించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. అంతేగాకుండా సూర్య, చంద్ర గ్రహ దోషాలు తొలగిపోతాయి. 
webdunia
Sathyanarayana swamy
 
ఇంకా పౌర్ణమి వ్రతం ఎలా చేయాలంటే..? 
పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి..ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకుని రంగవల్లికలతో అలంకరించుకోవాలి. ఆపై ఇష్టదేవతలను పూజించడం చేయాలి.

ఈ రోజున సత్య నారాయణ స్వామికి కేసరి బాత్, అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పించడం ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఆ రోజున చిత్ర గుప్తుని ఆలయాలను సందర్శించడం మంచిది. 
webdunia
Lord Shiva


అలాగే శివకేశవులను అష్టోత్తరాలతో స్తుతించడం మంచిది. అన్నదానం చేయడం ద్వారా సర్వశుభాలనిస్తుంది. అంతేగాకుండా ముక్తిని ప్రసాదిస్తుంది. 
 
అభిజిత్ ముహుర్తాలు - ఉదయం.. 11:48– రాత్రి 12:39 గంటల వరకు 
అమృతకాలము - సాయంత్రం 05:27 గంటల నుంచి 06:52 వరకు 
బ్రహ్మ ముహూర్తం - 04:20 గంటల నుంచి – 05:08 వరకు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భక్తులు లేకుండానే తిరుమలలో ప్రారంభమైన వసంతోత్సవాలు