గోవుకు అవిసె ఆకు, పండ్లను ఎందుకు ఇవ్వాలో తెలుసా?
ఆవుకు అవిసె ఆకు, పండ్లను ఇవ్వడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆవును పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. కామధేనువును పూజించడం ద్వారా పూర్వీకులు చేసిన పాప
ఆవుకు అవిసె ఆకు, పండ్లను ఇవ్వడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆవును పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. కామధేనువును పూజించడం ద్వారా పూర్వీకులు చేసిన పాపాలు, శాపాలు తీరుతాయి. పితృదేవతల ఆశీర్వాదం దక్కుతుంది. కుటుంబీకుల మధ్య ఐక్యత చేకూరుతుంది. శుభకార్యాలు జరుగుతాయి.
ముందుగా తెలియక చేసిన పాపాలను తొలగించుకోవాలంటే కామధేనువును పూజించాలి. చోరీలు, అవినీతికి పాల్పడటంతో ఏర్పడే దోషాలుతొలగిపోవాలన్నా కామధేనువును పూజించాల్సిందే. చాలాకాలం పాటు పితృదేవతలకు తిథి, కర్మకార్యాలు చేయని ఇంటివారు కామధేనువును పూజించడం ద్వారా ఆ పాపం తొలగిపోతుంది.
పితృదేవతలను పూజించని వారు, వారికి తిథికి అన్నం పెట్టని వారు పాపాత్ముల కిందకు వస్తారని.. అలాంటివారు అవిసె ఆకును ఆవును ఇవ్వడం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గోశాల పక్కన లేకుంటే గోవు వుండే ప్రాంతంలో కూర్చుని మంత్ర జపం చేయడం, ధర్మకార్యాలు చేయడం ద్వారా పలు రెట్లు శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు.