Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెల్ల జిల్లేడు ఆంజనేయ స్వామిని పూజిస్తే.. చేతబడులు?

తెల్ల జిల్లేడు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకల సంపదలను సొంతం చేసుకోవచ్చు. అయితే తెల్ల జిల్లేడుతో తయారైన ఆంజనేయుడిని పూజించాలంటే నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాల

తెల్ల జిల్లేడు ఆంజనేయ స్వామిని పూజిస్తే.. చేతబడులు?
, ఆదివారం, 1 జులై 2018 (13:54 IST)
తెల్ల జిల్లేడు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా సకల సంపదలను సొంతం చేసుకోవచ్చు. అయితే తెల్ల జిల్లేడుతో తయారైన ఆంజనేయుడిని పూజించాలంటే నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. శ్వేతార్క ఆంజనేయ స్వామిని అర్చించే వారు... సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. పూజా మందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. 
 
తెల్లజిల్లేడు హనుమన్నను పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన పీటపై పెట్టాలి. ఎరుపు రంగు పుష్పాలతో అర్చించాలి. పీట లేకుంటే పళ్ళెంలో అక్షింతలు, పూలు, సింధూరం జల్లి, వాటిమీద తెల్లజిల్లేడు ఆంజనేయ స్వామిని ఉంచాలి. తెల్ల జిల్లేడు ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి, పూలమాల వేసి, దీపారాధన చేయాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో ఈ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి.
 
''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్''
అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే తెల్లజిల్లేడు ఆంజనేయ స్వామిని ''హనుమజ్జయంతి'' నాడు పూజించడం శ్రేష్టం. ఇంకా అక్షయతృతీయ నాడు తెల్లజిల్లేడు ఆంజనేయ స్వామి పూజ జరుపుకోవడం ఉత్తమం. ఈ రోజుల్లో వీలు కుదరకపోతే, మంగళవారం లేదా శనివారం పూజించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.  
 
తెల్లజిల్లేడు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దుష్ట శక్తుల పీడ నుంచి తప్పించుకోవచ్చు. బాలారిష్ట దోషాలను, నవగ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. పిల్లల్లో బుద్ధి నైపుణ్యాన్ని తెల్లజిల్లేడు ఆంజనేయ స్వామి తొలగిస్తాడు. భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి. చేతబడులు తెల్లజిల్లేడు హనుమంతుడున్న చోట పనిచేయవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-07-2018 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు?