మంగళవారం నేతితో దీపారాధన చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
మంగళవారం రోజున దీపారాధన ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మంగళ, శుక్రవారాలు ముఖ్యంగా ఆవునేతితో దీపారాధాన చేయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. అలాగే మంగళవారం పూట సూర్యోదయానికి ముందో లేచి.. శుచిగా స్నానమా
మంగళవారం రోజున దీపారాధన ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. మంగళ, శుక్రవారాలు ముఖ్యంగా ఆవునేతితో దీపారాధాన చేయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. అలాగే మంగళవారం పూట సూర్యోదయానికి ముందో లేచి.. శుచిగా స్నానమాచరించి.. ఇంటిని శుభ్రం చేసుకుని.. పూజ సామాగ్రిని పూజకు సిద్ధం చేసుకోవాలి. దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టాలి.
ఆ దీపాల్లో మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన ఆవునేతిని పోసి వత్తులను వేయాలి. కేవలం అగరవత్తులతోనే దీపాలను వెలిగించాలి. అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు. అప్పటికే వెలిగించిన దీపంతో మరో దీపాన్ని వెలిగించకూడదు. మంగళవారం నేతితో దీపారాధన చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి.
మంగళవారం సాయంత్రం పూట లేదా ఉదయం పూట లక్ష్మీదేవి చిత్ర పటం ముందు నేతితో దీపమెలిగించడం ద్వారా మీకు రావాల్సిన డబ్బు చేతికందుతుంది. అలాగే విద్యాభివృద్ధి కోసం పిల్లల చేత సరస్వతీ దేవి ప్రతిమ లేదా పటం ముందు కూడా నేతితో దీపం వెలిగించవచ్చు. ఇలా చేస్తే ఉన్నత విద్యలను అభ్యసిస్తారని పండితులు చెప్తున్నారు.