Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనివారం సుదర్శన చక్రానికి తులసీ మాల సమర్పిస్తే?

సుదర్శన చక్రాన్ని ఆలయంలో దర్శించుకుంటే ఫలితం ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదవండి. పెరుమాళ్ల వారి కుడిచేతిలో వున్న చక్రాన్ని సుదర్శన చక్రంగా పిలుస్తారు. తమిళనాడు, కుంభకోణంలో వెలసిన చక్రపాణి ఆ

Advertiesment
Sudarshan chakra puja
, శుక్రవారం, 22 జూన్ 2018 (15:49 IST)
సుదర్శన చక్రాన్ని ఆలయంలో దర్శించుకుంటే ఫలితం ఏంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ స్టోరీ చదవండి. పెరుమాళ్ల వారి కుడిచేతిలో వున్న చక్రాన్ని సుదర్శన చక్రంగా పిలుస్తారు. తమిళనాడు, కుంభకోణంలో వెలసిన చక్రపాణి ఆలయంలో చక్రతాళ్వారే మూల విరాట్‌గా విరాజిల్లుతున్నారు. అధర్మాన్ని నిర్మూలించి.. ధర్మాన్ని స్థాపించడం ద్వారా ఈ చక్రానికి ధర్మచక్రం అని పేరుంది. 
 
సుదర్శనం అనేది మంచికి సంకేతం. అలాంటి సుదర్శన చక్రానికి శనివారం పూట తులసీ మాల సమర్పించి పూజించినట్లైతే సకలసంపదలు చేకూరుతాయి. పుణ్యఫలాలు లభిస్తాయి. దుఃఖం, భయం, శత్రు భయం, రుణ బాధలు, నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే.. శనివారం పూట సుదర్శన చక్రానికి తులసీ మాల సమర్పించాలి. 
 
ఇంకా సుదర్శన చక్రానికి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఇంకా జూన్ 22 (శుక్రవారం) సుదర్శన జయంతిని పురస్కరించుకుని ఆలయాల్లో జరిగే సుదర్శన హోమంలో పాల్గొనే వారికి సకలదోషాలు తొలగిపోతాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా తిరుమలలో జరిగే చక్రస్నానంలో పాల్గొనే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసలు వాస్తు శాస్త్రాన్ని నమ్మొచ్చా?