Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీక దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగిస్తారు.. ఎందుకో తెలుసా?

Advertiesment
కార్తీక దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగిస్తారు.. ఎందుకో తెలుసా?
, గురువారం, 8 నవంబరు 2018 (13:15 IST)
కార్తీక మాసంలో దీపం పెట్టడం ఆయువును ప్రసాదిస్తుంది. జ్ఞానేంద్రియాలపై సమస్త సుఖములు ఆధారపడి వుంటాయి. ఈ జ్ఞానేంద్రియాలకు పరమాత్ముడు శక్తిని ఇచ్చాడు. ఆత్మకాంతి కంటిమీద పడే శక్తినిస్తుంది. కంటిని ఇచ్చి వెలుతురును చూసే సుఖాన్ని తనకిచ్చిన ఈశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుతూ.. అందుకు ప్రతీకగా దీపాన్ని పెడుతున్నానని భావించాలని పండితులు చెప్తున్నారు. ఇలా పంచేంద్రియాలతో సుఖాలను పొందగలిగే శక్తినిచ్చిన ఈశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుతూ.. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారు. 
 
అలాగే మనిషి ఆయువు హృదయ స్పందనపై వుంటుంది. హృదయ స్పందన అనేది హృదయనాడి ద్వారా అనుసంధానం అయి వుంటుంది. హృదయ నాడి భౌతికంగా కనబడదు. అది ఈశ్వరుని తేజస్సును పొంది వుంటుంది. కార్తీక దీపం వలన హృదయ నాడి బలిష్టమవుతుంది. 
 
కార్తీక దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగిస్తారు. నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు వత్తి నుంచి వచ్చే పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. ఇలా జరగడం ఆయుర్‌కారకమని.. తద్వారా హృదయ నాడి నిలబడుతుందని పండితులు చెప్తున్నారు. అందుకే కార్తీక మాసంలో ఉదయం, సాయంకాలం దీపం పెట్టాలని వారు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లిలో ఆ రెండింటిని ఎందుకు పెట్టిస్తారో తెలుసా..?