శుక్రగ్రహం వక్రగతి కారణంగా 2023, జులై 24 నుంచి వరుసగా 43 రోజుల వరకు ఈ రాశుల వారు జాగ్రత్తగా వుండాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఈ సమయంలో ఏడు రాశుల వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ రాశుల వారు సెప్టెంబర్ 4 వరకు అంటే దాదాపు 43 రోజుల కాలం వరకు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
మేషరాశి:
మేషరాశి వారికి కుటుంబ కలహాలు తప్పవు. తండ్రి ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు కష్టాలు తప్పవు.
కన్యారాశి:
ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువ. అధిక ఖర్చులు కూడా పెట్టకుండా జాగ్రత్త పడాలి. పని ఒత్తిడి పెరిగి, విశ్రాంతి తక్కువ లభించే అవకాశం ఉంది. శనివారం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
వృశ్చిక రాశి:
తల్లి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఎక్కువ. అనవసరంగా ఖర్చులు పెట్టకూడదు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి అడ్డంకులు. ఈ కాలంలో ఒత్తిడి రెట్టింపు అవుతుంది. గణపతి, సరస్వతి దేవిని ఆరాధించాలి.
మకర రాశి:
సెప్టెంబర్ నాలుగు వరకు మకర రాశి వారు తీవ్రంగా శ్రమించాల్సి వుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారంలో, పెట్టుబడుల్లో నష్టాలు చవిచూసే ప్రమాదమూ పొంచి ఉంది.
కుంభరాశి:
వ్యాపారంలో పెద్ద నష్టం, కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. పై అధికారులతో గొడవలు పెట్టుకోకూడదు.
మీన రాశి:
మీన రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.