మాఘ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని షట్టిల ఏకాదశి అంటారు. షట్టిల ఏకాదశి రోజున సర్వార్థ సిద్ధి, అమృత సిద్ధి, వృద్ధి యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ రోజు ప్రాధాన్యత మరింత పెరిగింది. షట్టిల ఏకాదశి జనవరి 18, 2023 సాయంత్రం 04:02 గంటలకు ముగుస్తుంది.
షట్టిల ఏకాదశిరోజున వంకాయలు బియ్యం తినకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం వుండాలి. మద్యపానం, మాంసాహారం తీసుకోకూడదు. షట్టిల ఏకాదశి రోజున విష్ణు పురాణం లేదా శ్రీమద్ భగవద్గీత పారాయణంతో పాటు పూజలు చేయాలి.
ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున పూర్వీకులకు నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. నువ్వులను దానం చేయాలి. పూజ అనంతరం విష్ణు సహస్ర నామం పఠించాలి. విష్ణుమూర్తికి తులసి, నీరు, పండ్లు, కొబ్బరికాయ, పువ్వులను నైవేద్యంగా సమర్పించాలి.
షట్టిల ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది. అంతేకాదు నువ్వులను దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి ధనవంతులవుతారు.