శరత్ పూర్ణిమ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మానవ జీవితానికి రెండు ముఖ్యమైన అంశాలు చాలా అవసరం. మనస్సు, నీరు రెండింటినీ చంద్రుడు నియంత్రికగా భావిస్తారు. ఈ రోజున, చంద్రుని కాంతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. ఆటుపోట్లపై సహజ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
చంద్రుడు ఉత్పత్తి చేసే ఈ ప్రత్యేక ప్రభావం వల్ల సముద్రంలో అలల హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. సముద్రం మాత్రమే కాకుండా, చంద్రుని సానుకూల ప్రభావాలు మానవ శరీరంలో అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తాయి.
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ రోజున వేద చంద్ర పూజ చేయడం, శివలింగానికి పాలు, నీరు సమర్పించడం వంటివి చేస్తే ఈతి బాధలుండవు. జీవితంలో సానుకూల ఫలితాలు వుంటాయి. అలాగే పాయసాన్ని చంద్రునికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అది అమృతంగా పరిగణింపబడుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అందుకే పౌర్ణమి రోజున చంద్రకాంతిలో పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా.. దానిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.