Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15.5.2018 శనీశ్వర జయంతి.. శంఖుపూవులు సమర్పించి తైలాభిషేకం చేయిస్తే..?

15.5.2018 తేదీ శనీశ్వర జయంతి. మంగళవారం, భరణి నక్షత్రం నాడు శనీశ్వర జయంతి రావడం మంచి చేస్తుంది. ఈ రోజున శనీశ్వరుడిని పూజించే వారికి దోషాలుండవు. వైశాఖ బహుళ అమావాస్య అయిన ఈ రోజున శనీశ్వరునికి నువ్వుల నూన

15.5.2018 శనీశ్వర జయంతి.. శంఖుపూవులు సమర్పించి తైలాభిషేకం చేయిస్తే..?
, మంగళవారం, 15 మే 2018 (10:41 IST)
15.5.2018 తేదీ శనీశ్వర జయంతి. మంగళవారం, భరణి నక్షత్రం నాడు శనీశ్వర జయంతి రావడం మంచి చేస్తుంది. ఈ రోజున శనీశ్వరుడిని పూజించే వారికి దోషాలుండవు. వైశాఖ బహుళ అమావాస్య అయిన ఈ రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెను వెలిగిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
 
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం 
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||
 
నీలాంజన సమాభాసం = నీలవర్ణంలో ప్రకాశించే
రవిపుత్రం = సూర్య దేవుని పుత్రుడైన 
యమాగ్రజం = యమునికి సోదరుడు ఐన 
ఛాయామార్తాండ సంభూతం = ఛాయాదేవి (శనీశ్వరుని తల్లి), సూర్యుల సంతానమైన తం నమామి శనైశ్చరం = ఓ శనీశ్వరా నీకు నమస్కరిస్తున్నాను 
అని అర్థం. 
 
శనైశ్చరాయ అంటే శనైః = నెమ్మదిగా చరాయ = చరించే/తిరిగేవాడు.. శని దేవుడు జీవుల కర్మఫల ప్రదాత అంటే మనకు ఎందరు దేవుళ్లు, దేవతలు ఉన్నా, మనం చేసిన పుణ్యపాపకార్యాలకు ఫలితాన్ని ఇచ్చేది శనీశ్వరుడే. శివుడు శనికి వక్రదృష్టి, ఇతరశక్తులనిచ్చి, కర్మఫలదాతను చేస్తాడు. వాటిసాయంతో శనీశ్వరుడు క్రమశిక్షణ, మంచి లక్షణాలను కాపాడుతూ, చెడుని, చెడ్డవాళ్లను వారు చేసే కర్మలను అనుసరించి శిక్షించడం చేస్తాడు. ఇంకా మంచిపనులు చేసేవాళ్లకు, శుభాలు, ఉన్నతస్థితి కల్పించడం చేస్తాడు. శనీశ్వరుడు మంచివాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. 
 
ఇదే రోజున శని గాయత్రి మంత్రంతో శనిని పూజించాలి.. 
ఓం శనైశ్చరాయ విద్మహే 
సూర్యపుత్రాయ ధీమహి 
తన్నో మంద ప్రచోదయాత్ ||
 
శని యొక్క వక్రదృష్టి నుండి తప్పించుకోవాలంటే చెడుపనులను చేయకుండా వుండాలి. మంచి పనులే చేయాలి. అందుకే శనిత్రయోదశి, శనీశ్వర జయంతి రోజున నలుపు రంగు దుస్తులను సమర్పించుకోవాలి. బ్లూ లోటస్ పువ్వులను సమర్పించాలి. తైలాభిషేకం చేయించాలి. దశరథ కృత శని స్తోత్రం, హనుమాన్ చాలీసా భక్తితో పఠించే వారికి ఈతిబాధలుండవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం (15-05-18) దినఫలాలు... ధనవ్యయం విషయంలో..