Publish Date: Wed, 08 Apr 2026 (12:37 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (12:40 IST)
చైత్ర సప్తమి రోజున సూర్యపూజ విశేష ఫలితాలను ఇస్తుంది. సప్తమి తిథి నాడు సూర్య భగవానునికి జలాభిషేకం చేసి ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించాలి. సప్తమి తిథి నాడు ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు.
ఉపవాస సమయంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేయడం, వస్త్రాలు, ధాన్యాలు దానం చేయడం విశేషంగా ఫలప్రదంగా ఉంటుంది.
చైత్ర సప్తమి రోజున సూర్య పూజతో ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. పిల్లల సంతోషం, కుటుంబ శ్రేయస్సు చేకూరుతుంది.
జీవితంలో సానుకూల శక్తి, ఆధ్యాత్మిక ప్రశాంతత లభించాలంటే చైత్ర మాస సప్తమి రోజున సూర్యపూజ చేయాలి.
పనులలో విజయం, ఆటంకాలు తొలగిపోతాయి.
సెల్వి
Publish Date: Wed, 08 Apr 2026 (12:37 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (12:40 IST)