సాయిబాబాను గురువుగా భావించే వారు చాలామంది ఉన్నారు. గురువుకు ప్రీతికరమైన రోజున గురువారం ఉపవాసం ఉంటారు. తొమ్మిది వారాల పాటు గురువారం రోజున సాయిబాబాను స్మరించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉదయం లేదా సాయంత్రం సాయిబాబా చిత్రం ముందు శుభ్రమైన పలకపై పసుపు గుడ్డను పరిచి, దానిపై సాయిబాబా చిత్రపటాన్ని వుంచి పసుపు కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి.
బాబాకి ఇష్టమైన పసుపు పువ్వులను సమర్పించడం మంచిది. ఆపై నేతి దీపం వెలిగించి బాబా చరితను పఠించడం చేయొచ్చు. సాయిబాబాకు ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి. కొబ్బరికాయతో పాటు తీపి పండ్లను, కలకండను సమర్పించి పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి.