నరఘోష. అంటే ఒకరు ఉన్నతిని చూసి మరొకరు బాధపడటం.. కొన్నిచోట్ల పెద్దలు చెప్పినట్లుగా ఏడవడం. ఇలా ఒకరు వృద్ధి చెందుతుంటే ఇరుగుపొరుగు లేదా బంధువుల్లో కొందరు అసూయ, ద్వేషంతో ఏడవడం వల్ల నరఘోష ఏర్పడుతుందనీ, దానివల్ల కుటుంబంలో వారికి కష్టనష్టాలు సంభవిస్తాయని పెద్దలు చెపుతుంటారు. ఈ నరఘోషను వదిలించుకునేందుకు చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టడం, దిష్టి వినాయకుడు ఫోటోలు పెట్టుకోవడం చేస్తుంటారు.
ఐతే వీటితో పాటుగా ఇంకొక్క పని చేస్తే నరఘోష అనేది పటాపంచలవుతుందని నిపుణులు చెపుతున్నారు. ఆ పని ఏమిటంటే.. బంగాళా దుంపలు తీసుకుని వాటిని కాస్త ఉడికించి ఆ తర్వాత వాటి తొక్కు తీయాలి. అలా తీసిన ఆ బంగాళా దుంపలను సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు గోవుకి పెట్టాలి. ఇలా ఆదివారం లేదా గురువారం చేయాలి. నెలకి ఒక్కరోజు ఇలా చేస్తే చాలు. నరఘోష పీడ విరగడైపోతుంది.
ఐతే ఆవుకి బంగాళా దుంపలు పెట్టేనాడు ఇంట్లో నాన్-వెజ్ చేయకుండా వుంటే మంచిది. ఇలా గోవుకి బంగాళా దుంపలు పెట్టడం వల్ల మేలు జరుగుతుంది.