Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరుగును షాపుల్లో కొంటున్నారా? చేమిరి-పెరుగు ఆ రెండు మాటలు..? (video)

పెరుగును షాపుల్లో కొంటున్నారా? చేమిరి-పెరుగు ఆ రెండు మాటలు..? (video)
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (16:30 IST)
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి.. అప్పుల బాధ నుంచి విముక్తి పొందడానికి పరిహారాలు చేస్తున్నారా? ఆలయాల వెంట తిరుగుతున్నారా? అయితే కాస్త ఆగండి. ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం జరుగుతుందని.. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట నివాసం వుంటుంది అంటున్నారు.. జ్యోతిష్య నిపుణులు. వాటిలో మొదటిది ఏంటంటే? ఇంట్లో చెడు మాటలు పలకకుండా వుండటం. అలాగే రోజూ రెండంటే రెండు మాటలను ఉచ్ఛరిస్తూ వుండటం.
 
సాధారణంగా పెరుగు శ్రీ మహాలక్ష్మికి సమానంగా చెప్పబడే ఓ ఆహార పదార్థం. ఈ పెరుగును సాధ్యమైనంతవరకు షాపుల నుంచి కొనుగోలు చేయడం మానేయాలి. మనం ఇంట్లోనే పెరుగును తయారు చేసుకోవాలి. అప్పుడే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం వుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దేవతలను సమర్పించే పంచకవ్యంలో పెరుగుకు కీలక స్థానం వుంది కాబట్టి.  
 
ఇంకా ప్రతిరోజూ రాత్రి ఏ ఇంట పాలలో చేమిరి చేర్చి పెరుగు కోసం సిద్ధం చేస్తారో.. ఆ ఇంట మహాలక్ష్మీ దేవి నివాసం వుంటుందనేందుకు ఎలా సంశయం అక్కర్లేదు అంటున్నారు.. జ్యోతిష్య నిపుణులు. అలాగే పాలలో పెరుగును చేర్చేటప్పుడు ''చేమిరి'' అనే మాటను పలికండి. ఉదయం ఆ పాలు గడ్డ పెరుగుగా మారిపోతుంది. ఆ పెరుగును మీ చేతులారా తీసేటప్పుడు చేమిరి కోసం కొంత భాగం తీసి పక్కనబెట్టేయాలి. 
 
అలాగే చేమిరి కోసం తీసేటప్పుడు ''పెరుగు'' అని పలికి తీయాలి. రాత్రి పూట పెరుగు కోసం చేమిరిని తీసి ముందే సిద్ధంగా వుంచడం.. సేవింగ్స్‌కు నాందిగా మారుతుందని.. అది పెరుగుగా మారితే అది ధనాదాయానికి ప్రతీక అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం ద్వారా అంటే పెరుగును ఇంట్లోనే సిద్ధం చేసేవారింట తప్పకుండా శ్రీ మహాలక్ష్మీ దేవి కొలువై అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-04-2020 బుధవారం దినఫలాలు - హయగ్రీవ కవచం పఠిస్తే...