Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భగవంతునికి ప్రసాదం ఎందుకు పెట్టాలంటే..?

భగవంతునికి ప్రసాదం ఎందుకు పెట్టాలంటే..?
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:07 IST)
భగవంతునికి ప్రసాదం ఎందుకు పెట్టాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదావాల్సిందే. సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరైనా పద్దతేనా అంటే.. ఆధ్యాత్మిక పండితులు ఏం చెప్తున్నారంటే.. భగవంతుడు సర్వశక్తిమంతుడు. వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు. 
 
కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు. అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం. 
 
దేవుని పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్థనా లక్ష్యంపై మనసు సంపూర్ణంగా లగ్నం కాదు. ప్రసాదం అంటే దేవునికి లంచం ఇవ్వడం కాదు. భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాముడు జీవితంలో ఎన్నో వైఫల్యాలు... ఐనా ఆ దేవుడినే భారతదేశమంతటా ఎందుకు కొలుస్తారు...?