పిల్లి శకునం... మనల్ని చూసి పిల్లి దాక్కుంటే ఏంటి? ధైర్యంగా నిలబడితే ఏంటి?
పిల్లి శకునాన్ని చాలామంది నమ్ముతుంటారు. ఆ విశ్వాసాల ప్రకారం పిల్లి కనుక మనం వెళ్లే దారికి అడ్డంగా వస్తే ఆ రోజు చేపట్టే పనులు పూర్తికాకుండా ఆగిపోతాయి. మగపిల్లి, ఆడపిల్లి కలిసి తిరుగుతుంటే బాధలు కలుగుతాయి. మరో సందర్భంలో అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస
Publish Date: Tue, 15 Nov 2016 (17:18 IST)
Updated Date: Tue, 15 Nov 2016 (17:23 IST)
పిల్లి శకునాన్ని చాలామంది నమ్ముతుంటారు. ఆ విశ్వాసాల ప్రకారం పిల్లి కనుక మనం వెళ్లే దారికి అడ్డంగా వస్తే ఆ రోజు చేపట్టే పనులు పూర్తికాకుండా ఆగిపోతాయి. మగపిల్లి, ఆడపిల్లి కలిసి తిరుగుతుంటే బాధలు కలుగుతాయి. మరో సందర్భంలో అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పిల్లి మూతిని నీళ్లలో కడుక్కుంటే ఇంటికి బంధువులు వస్తారు. కుక్కలను చూసి పిల్లి పరిగెత్తుతుంటే శత్రు భయం కలుగుతుంది.
మనల్ని చూసి పిల్లి దాక్కుంటే చేపట్టే పని పూర్తవుతుంది. మనం పెంచుకునే పిల్లి ఎదురువస్తే ఎటువంటి దోషం లేదు. పిల్లి ఎలుకలను చూసి పారిపోతుంటే విఘ్నం తొలగిపోతాయి. పిల్లి ఎలుకను వేటాడి మన ఎదురుగా వస్తే శత్రువులు నశిస్తారు. మనం తొందరగా పనులు చేస్తుంటే పిల్లి మధ్యలో వస్తే చేసే పనులు ఆగిపోతాయి. అలాంటి సమయాల్లో ఆ పనుల్లి ఆపాలి.
పిల్లి కక్కుతుంటే ఆరోగ్యం కలుగుతుంది. పిల్లి తన పిల్లలను నోట కరుచుకుని పోతుంటే స్థాన మార్పు కలుగుతుంది. పిల్లి ఎలుకలను చూసి పారిపోతుంటే విఘ్నం తొలగిపోతుంది. పిల్లి తన పిల్లలను తీసుకుని వస్తుంటే విఘ్నాలు ఏర్పడతాయి.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More