Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్జల ఏకాదశి రోజున ఇలా చేస్తే.. కోటి సువర్ణ ముద్రలు దానం చేస్తే..?

నిర్జల ఏకాదశి రోజున ఇలా చేస్తే.. కోటి సువర్ణ ముద్రలు దానం చేస్తే..?
, శనివారం, 19 జూన్ 2021 (21:57 IST)
ఏకాదశి తిథి అంటే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం. అన్ని ఏకాదశిల్లో నిర్జల ఏకాదశి ఉత్తమమైనది. నిర్జల ఏకాదశి ఉపవాసాలను పాటించడం ద్వారా, 24 ఏకాదశి ఉపవాసాలకు సమానమైన ఫలితాలను పొందుతారని విశ్వాసం. 
 
జ్యేష్ఠ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశి విష్ణువుకు ప్రియమైనది. ఈ రోజు విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నిర్జల ఏకాదశి ఉపవాస సమయంలో కనీసం నీరు కూడా తాగారు. ఏకాదశి ఉపవాసం విడిచిన అనంతరం నీరు తాగుతారు. ఏకాదశి పూజ బ్రహ్మ ముహర్తంలో మొదలవుతుంది. అమృత కాలంతో ముగుస్తుంది.
 
ఈ రోజున బ్రహ్మ ముహర్త కాలంలో నిద్ర లేచి స్నానమాచరించాలి. దేవుడి ముందు దీపం వెలిగించాలి. తర్వాత విష్ణువును గంగా నీటితో అభిషేకం చేయాలి. విష్ణువుకు పువ్వులు, తులసిదళాలను అర్పించండి. ఆరోజు విష్ణు సహస్రనామాలతో పూజని నిర్వహించండి.
 
పూజ అనంతరం విష్ణువు సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అయితే అలా నైవేద్యంగా సమర్పించే ఆహారంలో తలసి దళాన్ని వేయాలి. తులసి దళం లేని నైవేద్యాన్ని విష్ణువు స్వీకరించడని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి. పూజ అనంతరం విష్ణువు సాత్విక ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అయితే అలా నైవేద్యంగా సమర్పించే ఆహారంలో తులసి దళాన్ని వేయాలి. 
 
తులసి దళం లేని నైవేద్యాన్ని విష్ణువు స్వీకరించడని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి. విష్ణు దేవాలయంలో పూజలు, హోమాలు చేయించే మంచి ఫలితం ఉంటుంది. 
 
పాలు, పెరుగు, నెయ్యి, (లేదా వెన్న) తేనె, చక్కెరతో విష్ణుమూర్తికి అభిషేకం చేయించాలి. వస్త్రాలు, ధాన్యాలు, గొడుగులు, చేతి విసనకర్రలు, బంగారం దానం చేయాలి. ఆ రోజు రాత్రి జాగరణ చేసి.. మరుసటి రోజు శుచిగా స్నానమాచరించి ఇతరులకు ఆహారం, దుస్తులు, పండ్లు, పాలు వంటివి దానం చేసి నీరు తాగి ఉపవాసాన్ని ముగించుకోవాలి.
 
ఏకాదశి వ్రతం చేసిన వారికి స్వర్గం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజు ఎవరైతే నీటిని కూడా తాగకుండా వుంటారో వారికి ఒక్కొక్క ఏకాదశికి కోటి సువర్ణ ముద్రలు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. నిర్జల ఏకాదశినాడు చేసిన స్నానం దానం, జపం, హోమం, మొదలైనవన్నీ అక్షయమవుతాయని పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-06-2021 శనివారం దినఫలాలు - తులసీదళాలతో పూజించినా...