కుజుడు వేడి గ్రహం... మంగళవారం పైనాపిల్ తినండి...
నవగ్రహాలు.. వాటి ప్రభావానికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడి ప్రభావం వుంటుంది.
నవగ్రహాలు.. వాటి ప్రభావానికి అనుగుణంగా ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడి ప్రభావం వుంటుంది. కుజుడు వేడి గ్రహం. కనుక వేడిపుట్టించే మామిడి పండు, పైనాపిల్, ఉల్లిపాయ, మిరియాలు, వెల్లుల్లి మొదలైనవి బాగా పీల్చబడి త్వరగా జీర్ణమవుతాయి.
ఆదివారం మన ఆహారంపై సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక ఏ ఆహారాన్నైనా తేలిక జీర్ణమై శరీరాన్ని పీల్చేస్తుంది. సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది కాబట్టి.. నీటి సంబంధమైన ఈ గ్రహానికి గుమ్మడి, దోస, పుచ్చ పండు వంటివి తీసుకోవడం ద్వారా సులభంగా జీర్ణమవుతాయి.
అలాగే బుధవారం ఎలాంటి ఆహారమైనా తీసుకోవచ్చు. గురువారం గురుగ్రహ ప్రభావం వుంటుంది. పసుపు లేదా ఆరెంజ్ రంగు ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆరెంజ్, నిమ్మ, అరటింపండు మొదలైనవి తీసుకోవాలి. శుక్రవారం శుక్రుడి ప్రభావం ఉంటుంది.
శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఆహారాలు బాదం పిస్తా, బాదం పప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలైన డార్క్ చాక్లెట్, వేపిన గుమ్మడి గింజలు వంటివి తినడం మంచిది. శనివారం శని ప్రభావం వుంటుంది కాబట్టి శని నూనెలపై ఆధిపత్యం కలిగి వుంటాడు. కనుక నూనె ఆహారాలు, జంక్ ఫుడ్ శనివారం బాగా జీర్ణం అవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.