Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనివారం నాగపంచమి ప్రత్యేకం.. సమస్త నాగదోషాలు తొలగిపోవాలంటే? (video)

శనివారం నాగపంచమి ప్రత్యేకం.. సమస్త నాగదోషాలు తొలగిపోవాలంటే? (video)
, శుక్రవారం, 24 జులై 2020 (19:26 IST)
Nagapanchami
శ్రావణమాసంలో వచ్చే పంచమి రోజున నాగపంచమి పేరుతో నాగదేవతను కొలుస్తాం. ఈ నాగపంచమి పండుగ వెనుక బోలెడు కారణాలు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు కాళియమర్దనం చేసింది ఈ రోజే అని చెబుతారు. లోకానికి తమ జాతి చేస్తున్న మేలుకి బదులుగా... ఈ రోజు తమని పూజించాలంటూ ఆదిశేషుడు, విష్ణుమూర్తిని కోరుకున్నట్లూ చెబుతారు. 
 
ఈ నాగపంచమి మహిమని సాక్షాత్తు ఆ శివుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. నాగపంచమిని ఎలా జరుపుకోవాలో కూడా శాస్త్రాలు సూచిస్తున్నాయి. నాగపంచమి శనివారం రోజున రావడం విశేషం. నాగు ఆదిశేషువు అవతారం. అందుచేత శనివారం  ఉదయం 05.39 గంటల నుంచి 08.22 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. 
 
పంచమి తిథి జూలై 24, ఉదయం 02:34 నుంచి ప్రారంభమై... జూలై 25 మధ్యాహ్నం 12.02 గంటలతో ముగియనుంది. ఈ రోజున పాలు ప్రసాదంగా సమర్పించాలి. పుట్టపై పాలు పోసి.. పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించాలి. ఈ పండుగనాడు ''కర్కోటకస్య నాగస్య'' అనే మంత్రాన్ని చదివితే కలి దోష నివారణ కలుగుతుందని శాస్త్రప్రవచనం. గ్రహదోషాలున్నవారు రాహుకేతువులను పూజిస్తే ఆ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈరోజున నాగదేవిని పూజిస్తే, అనేక శుభప్రదమైన ఫలితాలు వస్తాయని విశ్వాసం. 
webdunia
Nagamma
 
పూజా విధానం.. నాగ పంచమి నాడు పుట్టలకు పూజ చేయించడం.. పాలు పోయడం వంటివి చేస్తే సమస్యలన్నీ తొలగిపోయి..సంతాన సమస్యలు పోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే దేవాలయాల్లో నాగా అష్టోత్తరములు, పంచామ్రుతాలతో అభిషేకరం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే, సకల భోగభాగ్యాలు కలుగుతాయని చాలా మంది విశ్వసిస్తారు. అలాగే కాలసర్పదోషం తొలగిపోతుంది. అలాగే రాహు-కేతు దోషాలు వుండవు. సమస్త నాగ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''నాగపంచమి'' పూజ ఎలా చేయాలంటే?