Publish Date: Mon, 18 May 2026 (09:44 IST)
Updated Date: Mon, 18 May 2026 (10:07 IST)
Mantra to chant on Monday
ప్రతి సోమవారం ఈ శక్తివంతమైన మంత్రాలను పఠించడం ద్వారా అభీష్టాలు నెరవేరడంతో పాటు శివ సాయుజ్యం లభిస్తుంది. మోక్షం ప్రాప్తిస్తుంది. సోమవారం శివయ్యను తలచుకోవడం ద్వారా ఉన్నత లక్ష్యాలను అధిగమించవచ్చు. ఇంకా శివానుగ్రహం లభిస్తుంది. సోమవారం శివ మంత్ర పఠనంతో లాభాలేంటో తెలుసుకుందాం..
సోమవారం పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా భయం, మానసిక ఆందోళన, ఒత్తిడి దూరమవుతుంది. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఆరోగ్యంగా వుంటారు. ప్రమాదాలను దూరం చేసుకోవచ్చు. అనుకూలత చేకూరుతుంది. అన్నీ కార్యాల్లో విజయం వరిస్తుంది. ధైర్యం పెరుగుతుంది. కర్మ ఫలాలతో ఏర్పడే అడ్డంకులు దూరమవుతాయి.
పూర్వ జన్మ పాపాలు, దోషాలు తొలగిపోతాయి. వివాహం, వ్యాపారం, ఆర్థిక పరంగా పురోభివృద్ధి వుంటుంది. ఆయురారోగ్యాలతో పాటు ఆయుష్షు పెరుగుతుంది.
సోమవారం పూట ఉదయం గానీ, సాయంత్రం గానీ శివుని ముందు ఓ దీపాన్ని వెలిగించి.. శివలింగానికి అభిషేకం చేసి పాలను నైవేద్యంగా సమర్పించి.. మనస్ఫూర్తిగా పంచాక్షరీ మంత్రాన్ని లేదా ఇతర శివ నామాలను జపించడం ద్వారా అనుకున్న కార్యాలు అనుకున్నట్లు జరుగుతాయి. ప్రతి సోమవారం ఐదు నిమిషాల పాటైనా శివ నామ జపం చేస్తే ఆధ్యాత్మికత పెంపొందుతుంది. కర్మ తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.