పితృ దేవతలకు సద్గతులు కలిగి సుఖశాంతులు, వంశాభివృద్ధి కలగాలంటే మహాలయ అమావాస్య రోజు దానాలు చేయడం శ్రేష్ఠమని పండితులు చెబుతారు. అమావాస్య రోజు పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి పండి పెడితే మంచిది. మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు.
కుటుంబంలో పెద్దలను కోల్పోయిన వారు.. తల్లిదండ్రులు ఇద్దరూ లేని వారు ఈ పక్షంలో తప్పని సరిగా పితృకర్మలు చేయాలి. ఈ 15 రోజుల్లో చేయలేని వారు.. కనీసం మహాలయ అమావాస్య రోజైనా భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందించి.. వారి ఆకలి తీర్చాలంటారు.
మహాలయ పక్షం రోజుల్లో ఇంకా మహాలయ అమావాస్య రోజున ఇచ్చే తర్పణాల వల్ల పితృ దేవతల ఆకలి తీరి వారు సంతృప్తి చెందుతారని వెల్లడిస్తున్నారు. ఎవరైనా ఏ తిథిలో చనిపోయారో మనకు తెలియకపోతే.. వాళ్లకు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తారు. ఇలా చేయడం వల్ల పితృ దేవతల ఆశీస్సులు తప్పక కలుగుతాయంటారు.