Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుబేర ముద్ర.. అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.. తెలుసా? (video)

Advertiesment
కుబేర ముద్ర.. అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది.. తెలుసా? (video)
, శుక్రవారం, 31 జనవరి 2020 (14:14 IST)
యోగ ముద్రల ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. చేతి వేళ్ళ ద్వారా వేసే ముద్రల ద్వారా ఆరోగ్య పరమైన ప్రయోజనాలున్నాయని యోగా గురువులు చెప్తున్నారు. యోగ ముద్రల ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఒత్తిడిని ఇవి దూరం చేస్తాయి. కొన్ని ముద్రలను రోజూ పాటిస్తే కనుక ఒత్తిడి ఎలా అధిగమించగలమనే నిజాలను తెలుసుకోవచ్చు. 
 
కుబేర ముద్ర సంపదను సూచిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. ఇది త్రీ ఫింగర్ టెక్నిక్‌గా పిలవబడుతోంది. ఈ ముద్ర సంపదను.. అంతర్గత శక్తిని పెంచుతుంది. ఈ మూడు వేళ్లు ఒత్తిడిని జయిస్తాయి. 
 
ఈ మూడు వేళ్లను ముద్రలో భాగం చేయడం ద్వారా ఆలోచనా శక్తి పెంపొందుతుంది. అలాగే అంగారకుడు, బుధుడు, శని గ్రహాలను కలిసి వుంచినట్లవుతుంది. ఫలితంగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ ముద్ర ద్వారా శాశ్వత బలం కలుగుతుంది. జీవక్రియను పెంచుతుంది. అంగారకుడు, బుధుడు, శనిగ్రహాలు ఒక పాయింట్‌కు చేరడం ద్వారా మూడు గ్రహాల ప్రభావంతో పాజిటివ్ ఫలితాలుంటాయి. 
 
ముందుగా పద్మాసనంపై కూర్చోవాలి. కూర్చునేందుకు మ్యాట్‌ను ఉపయోగించవచ్చు. సూర్యోదయం సమయంలో ఈ ముద్రను వేసినా మంచి ఫలితం వుంటుంది. తర్వాత కళ్లను మూసి.. ధ్యానంలోకి వెళ్లాలి. ముందుగా చూపుడు, మధ్య వేళ్లను బొటన వేలిపై ఆనించి.. ఉంగరపు వేలును, చిటికెడు వేలును అరచేతిలోకి తీసుకోవాలి. ఇలా చేస్తే సంపదలకు ఢోకా వుండదు. 
 
ఈ ముద్ర సంపదకు అధిపతి అయిన కుబేరుడిని సూచిస్తుంది. ఈ ముద్ర ద్వారా భోగభాగ్యాలు సొంతమవుతాయి. అందుకే ఈ ముద్రను సిరిసంపదలను ఆర్జించాలనుకునే వారు రోజు పాటించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.  కుబేర ముద్రను రోజూ ఉదయం అరగంట పాటు వేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సంపద వెల్లువలా వస్తుంది. 
 
ఈ ముద్రను ఉదయం, సాయంత్రం పూట ఏ సమయంలోనైనా పాటించవచ్చు. రోజుకు ఎన్నిసార్లైనా కుబేర ముద్రను పాటించవచ్చు. రోజుకు ఐదు- పదిసార్లు వేస్తే మంచి ఫలితాలుంటాయి. బొటనవేలు అగ్నిని, చూపుడు, మధ్య వేలు గాలి, భూమిని సూచిస్తాయి. ఈ మూడు శక్తులు కలిసి వున్నప్పుడు మీరు కోరుకునే కోరికలు, ఆకాంక్షలన్నీ నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31-01-2020 మీ రాశి ఫలితాలు- లక్ష్మీదేవిని పూజించి, అర్చించినట్లైతే? (Video)