Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనవరి 22: కృష్ణపక్ష కాలాష్టమి.. మిరియాలు, గుమ్మడి, కొబ్బరి దీపం వెలిగిస్తే..?

Advertiesment
Kalabhirava

సెల్వి

, మంగళవారం, 21 జనవరి 2025 (22:29 IST)
కృష్ణ పక్ష కాలాష్టమి తిథి జనవరి 22న వస్తోంది. ఈ రోజున భక్తులు కాలభైరవుడిని పూజిస్తారు. కాలభైరవునిని పూజిస్తారు. ఆయన దేవాలయాలను సందర్శిస్తారు, భైరవుడికి గుమ్మడి కాయతో దీపం వెలిగిస్తారు. కాలాష్టమిని మాఘ మాసం 21 జనవరి 2025న జరుపుకుంటున్నారు. 
 
అష్టమి తిథి ప్రారంభం: 12:39 PM, 21 జనవరి 2025
అష్టమి తిథి ముగుస్తుంది: 03:18 PM, 22 జనవరి 2025
 
కాలాష్టమి ప్రాముఖ్యతను ఆదిత్య పురాణంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర దినం శివుని శక్తివంతమైన అవతారమైన కాలభైరవుని ఆరాధనకు అంకితం చేయబడింది. కాలభైరవుడు అంటే 'కాల దేవుడు' అని అర్థం, శివుని ఉగ్ర శక్తి అని చెప్పబడుతోంది. శివ భక్తులు కాలష్టమిని ఎంతో భక్తితో జరుపుకుంటారు. భక్తులు కాలాష్టమి నాడు ఉదయాన్నే లేచి, సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం చేస్తారు. గత పాపాలకు క్షమాపణ కోరుతూ భగవంతుడిని పూజిస్తారు. తమ భక్తిని ప్రదర్శించడానికి ఉపవాసం ఉంటారు, కాలాష్టమి వ్రత కథను పఠిస్తారు. శివుడికి అంకితం చేయబడిన పవిత్ర మంత్రాలను జపిస్తారు. పూజ ఆచారంలో భాగంగా, భక్తులు కాలభైరవుడికి ఆవాల నూనెతో దీపం వెలిగిస్తారు. నువ్వుల నూనెతోనూ దీపం వెలిగించవచ్చు. ఇంకా కాలభైరవాష్టకాన్ని పఠించవచ్చు. 
 
కాశీ నగరానికి కాలభైరవుడిని గ్రామదేవతగా భావిస్తారు. ఎనిమిది వేర్వేరు దిశల నుండి కాశీని రక్షించే బాధ్యత అతనికి అప్పగించబడింది. కాలభైరవుడు అసురులను చంపడం ద్వారా మనల్ని రక్షిస్తాడు. కాళభైరవ వాహనం శునకం. శునకాలను పెంచడం ద్వారా కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. శునకాలకు ఆహారం అందించడం ద్వారా సంతాన ప్రాప్తిని ప్రసాదిస్తాడని విశ్వాసం. భైరవునికి మూడు రకాల దీపాలు వెలిగిస్తారు. మిరియాల దీపం, కొబ్బరి దీపం, గుమ్మడికాయ దీపం అనేవి భైరవునికి ఇష్టపడే మూడు దీపాలు.
 
మిరియాల దీపం అష్టమి తిథి, రాహు కాలంలో భైరవుడిని పూజించడానికి ఉపయోగించాలి, ఎందుకంటే ఇది  వ్యాపారం, శ్రేయస్సు, ఉద్యోగాన్ని మెరుగుపరుస్తుంది. తాంత్రిక ఇబ్బందులు, భయాలు, ఆరోగ్య సమస్యలను కూడా తొలగిస్తుంది.
 
27 నల్ల మిరియాలను తీసుకొని శుభ్రమైన కొత్త వస్త్రంలో మడత పెట్టి, దానితో ఒక ముడి వేసి వత్తిని తయారు చేయండి. మిరియాలలో చుట్టబడిన ఆ చిన్నపాటి మూటను ఆవనూనెలో ముంచి రాత్రంతా అలానే వుంచండి.   తర్వాతి రోజు అంటే అష్టమి రోజు రాహుకాలంలో, మిరియాలతో నిండిన ఆ వత్తితో మరింత నూనె చేర్చి.. ప్రమిదలో వుంచి దీపం వెలిగించాలి. 
 
రాహుకాలంలో దీపం వెలిగించి కాలభైరవాష్టకం పఠించండి. ఏదైనా ఆలయంలోని భైరవుని ముందు దీపం వెలిగించండి. మిరియాల దీపంతో పాటు గుమ్మడికాయ దీపం లేదా కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల అద్భుతాలు.. కలియుగాంతంలో వెంకన్న అప్పు తీరుతుందట! నిజమేనా?