ఏలినాటి శనితో ఎలాంటి కష్టాలొస్తాయ్.. శ్రీరాముడు-పాండవులు శనిప్రభావంతోనే?

ఏలినాటి శని అంటే ఏమిటి? శనిదోషం అనేది ఎలాంటి అశుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. శనీశ్వరుడు మానవులనే కాదు.. దేవతలను సైతం వదిలిపెట్టలేదు. శనిగ్రహ ప్రభావంతో ఎంతటి గొప

శనివారం, 31 డిశెంబరు 2016 (12:44 IST)
ఏలినాటి శని అంటే ఏమిటి? శనిదోషం అనేది ఎలాంటి అశుభ ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. శనీశ్వరుడు మానవులనే కాదు.. దేవతలను సైతం వదిలిపెట్టలేదు. శనిగ్రహ ప్రభావంతో ఎంతటి గొప్ప వ్యక్తైనా కష్టాలు అనుభవించాల్సిందే. సాధారణంగా శనిగ్రహం లోకాన్ని చుట్టేందుకు 30 సంవత్సరాలు పడుతుంది. 
 
శని గ్రహము తనకక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరముల చొప్పున పన్నెండు రాశులలో 30 సంవత్సరాలు పడుతుంది. ఇలా సంచరిస్తున్నప్పుడు 30 సంవత్సరములలో ఏడున్నర సంవత్సరాలు మానవునికి ఇబ్బందులు తప్పవు. ఎవరికైనా జన్మ రాశితో పాటు, జన్మరాశికి ఇరువైపులా ఉన్న రాశులలో శని సంచరించు కాలమును ఏలిన నాటి శని అంటారు.
 
ఈ ఏలినాటి శనిదోషం మనఃకారకుడైన చంద్రుని మీద శని సంచారం వల్ల ఏర్పడుతుంది. చంద్రుడికి వ్యయస్థానము నందు అనగా రాశికి వ్యయ స్థానము నందు సంచరించడం. దీనివల్ల ఖర్చులు అధికమవ్వడం, అశాంతి, సుఖం లేకపోవడం, ఆందోళన వంటివి ఉండగలవు. అలాగే ఆరోగ్యములో అధికమైన సమస్యలు తలెత్తడం, పరస్పర అవగాహనాలోపం, మనిషి క్షీణించడం, చికాకులు వంటివి ఉండగలవు. 
 
ధన, కుటుంబ, వాక్ స్థానము నందు శని సంచారం వల్ల విరోధులు పెరగటం, ఆర్థిక ఒడిదుడుకులు, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో పనిభారం పెరగడం, పెద్దలకు వీడ్కోలు పలకడం, అపజయం, తొందరపడి సంభాషించడం వంటివి జరిగిపోతుంటాయి. అలాంటి ఈ శని ప్రభావంతో మానవులే కాకుండా దేవతలు కూడా నానా తంటాలు అనుభవించారు. 
 
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా 14 సంవత్సరములు శనిదోషం వల్ల అరణ్యవాసం చేశాడు. ఈ దోష నివారణానంతరం రావణాశురునిపై జయం పొందాడు. అలాగే ద్వాపర యుగంలో పాండవులు ఈ శనిదోషం వల్ల 14 సంవత్సరములు అజ్ఞాతవాసం చేసి అడవుల వెంట తిరిగి నానా ఇబ్బందులు పడ్డారు.

మహాదేవుడైన ఈశ్వరుడు కూడా శనిదోషం వల్ల చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడు. అందుకే శని పడితే కష్టాలు తప్పవంటారు పంచాంగ నిపుణులు. కాబట్టి శనివారం నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చేసి.. నువ్వులతో దీపమెలిగిస్తే శని ప్రభావంతో అశుభ ఫలితాలు చాలా మటుకు తగ్గుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ధనవంతులు కావాలంటే.. ఇంట్లో ఈ వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోకూడదు..!!