పూజ చేయడంలో పరమార్థం వుంది. అలాంటి పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా? అనే అనుమానం అందరిలో వుంది. నిల్చుని పూజ చేయడం అవసరంలో ఏదో కానిచ్చేస్తున్నట్లు వుంటుంది. అందుకే కూర్చుని పూజ చేయాలి. శాస్త్రాలు కూర్చుని మాత్రమే పూజ చేయాలి అంటున్నాయి.
చిన్న పాటి వస్త్రాన్ని లేదా చాపను పరిచి దానిపై కూర్చుని మాత్రమే పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఎప్పుడూ కూర్చుని పూజ చేయడం ద్వారా ఉన్నత ఫలితాలను పొందవచ్చు.
పూజగదిలో ఎత్తులో వుండటం, అందులోని విగ్రహాలు కూడా ఎత్తులో వుండకూడదు. నేలమట్టానికి సమానంగా పూజగది వుండాలి. ఆ ప్రాంతంలో కూర్చుని పూజ చేయవచ్చు. విగ్రహాలను ఎత్తులో వుంచకూడదు. పూజ చేసేటప్పుడు నిర్మలమైన మనస్సుతో ప్రశాంతంగా పూజ చేయాలి.
తొందర తొందరగా, హడావుడిగా పూజ చేయకూడదు. అలాగే హారతి ఇచ్చేటప్పుడు మాత్రం లేచి నిల్చుని హారతి ఇవ్వడం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. పూజ చేసేటప్పుడు నుదుట తప్పకుండా తిలకం ధరించాలి. ఉత్తరం వైపు, తూర్పు వైపు కూర్చుని పూజ చేయవచ్చు.