Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

Advertiesment
Godess Lakshmi Puja

సెల్వి

, గురువారం, 10 ఏప్రియల్ 2025 (21:27 IST)
Godess Lakshmi Puja
శుక్రవారం పూజ ఐశ్వర్యం పొందవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. శుక్రవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయాన్నే తలారా స్నానం చేసి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆవు నేతితో దీపాన్ని వెలిగించి, సాంబ్రాణి ధూపం వేయాలి. శ్రీ మహాలక్ష్మీ స్థిర నివాసమైన శ్రీనివాసుని వక్షస్థలాన్ని పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆపై 108 తులసి దళాలను సేకరించాలి. 
 
శుక్రవారం తులసి దళాలు తెంపకూడదు కాబట్టి ముందు రోజే సేకరించుకోవాలి. ఇప్పుడు శ్రీలక్ష్మి అష్టోత్తర శత నామాలు ఒక్కొక్కటి చదువుతూ ఒక్కొక్క తులసి దళం స్వామి పాదాల వద్ద ఉంచాలి. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. శ్రీనివాసుని, శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన పొంగలి ప్రసాదాన్ని నివేదించాలి. ఇలా నియమానుసారంగా 11 శుక్రవారాలు పూజిస్తే దారిద్య్ర బాధలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. 
 
అమ్మవారి ప్రాణనాథుడైన స్వామివారిని పూజించడం వలన ఆ తల్లి అనుగ్రహం కూడా లభిస్తుంది. శుక్రవారం చేసే ఈ పూజతో ఇంట్లో, పని ప్రదేశంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తద్వారా ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలుంటాయి. సుఖమయ జీవితం చేకూరుతుంది. దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. ఇంకా ఉత్తర ఫాల్గుణి తిథి రోజున మహాలక్ష్మీ పూజ, కుమార స్వామి పూజ సర్వశుభాలను ప్రసాదిస్తుంది. అష్టైశ్వర్యాలను చేకూరుస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి