శనివారం శని గ్రహానికి అంకితమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో ఈ గ్రహం చాలా ముఖ్యమైనది. శని గ్రహం దీర్ఘాయువు, ఏకాగ్రత, క్రమశిక్షణను సూచిస్తుంది. ఇది వ్యాధులు, వృద్ధాప్యం, మరణాన్ని సూచిస్తుంది.
జ్యోతిష్కులు శనిగ్రహాన్ని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇంకా ఏలినాటి శని గ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే.. శివారాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి. చాలామంది శనివారాల్లో ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉదయం ప్రారంభమై సాయంత్రం ముగుస్తుంది. ఉపవాసం, శని దేవుడిని ప్రార్థించిన తర్వాత భోజనం చేస్తారు.
శని భగవానుడికి నలుపు రంగు ప్రీతికరం. కాబట్టి తినే ఆహారంలో కూడా నువ్వులు లేదా నల్ల శనగలు చేర్చుకోవాలి. ఉప్పు తీసుకోకూడదు. శివుడు, హనుమంతుడి శనివారం పూజించాలి. శని, ఈశ్వర, హనుమంతులను సాధక మంత్రాలతో స్తుతించాలి.
శనికి అంకితం చేయబడిన దేవాలయాలు లేదా పుణ్యక్షేత్రాలను సందర్శించాలి. చేసే పూజలో నల్లబెల్లం, నూనె, నువ్వులు నైవేద్యంగా ఉంటాయి. నల్లని వస్త్రాలు, నల్ల గొడుగులను దానం చేయాలి. ఇలా చేస్తే శని గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.