Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బయటికి వెళ్తున్నారా? శవం ఎదురైందా? అది శుభసూచకమే.. డోంట్ వర్రీ!

మనం ఇంటినుండి బయటకు వెళ్తున్నపుడు పిల్లి ఎదురైతే ఆ రోజు చేపట్టే పనులు పూర్తికావని జ్యోతిష్కులు అంటున్నారు. అయితే... పనిమీద ఒక్కోసారి హడావిడిగా వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే... అయ్యోరామా.. శకునం బాలే

బయటికి వెళ్తున్నారా? శవం ఎదురైందా? అది శుభసూచకమే.. డోంట్ వర్రీ!
, గురువారం, 7 జులై 2016 (14:17 IST)
మనం ఇంటినుండి బయటకు వెళ్తున్నపుడు పిల్లి ఎదురైతే ఆ రోజు చేపట్టే పనులు పూర్తికావని జ్యోతిష్కులు అంటున్నారు. అయితే...  పనిమీద ఒక్కోసారి హడావిడిగా వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే... అయ్యోరామా.. శకునం బాలేదని తమ పనులను వాయిదా వేసుకుంటారు చాలామంది. అదే మనం ఇంట్లో పెంచుకునే పిల్లి ఎదురైతే మాత్రం ఎలాంటి దోషం లేదని నిపుణులు అంటున్నారు. 
 
ఏదైనా శుభకార్యక్రమానికి బయలుదేరుతుంటే ఎవరైనా విధవరాలు ఎదురొస్తే అశుభమని భావిస్తాం. ప్రతియొక్కరికి ఈ నమ్మకం ఉంటుందని చెప్పలేము. వాళ్లవాళ్ల నమ్మకం వాళ్లది. ముఖ్యంగా ఏదైనా పని మీద బయటకు వెళుతుంటే మధ‌్యలో శవం ఎదురైతే చాలా మంది భయపడుతుంటారు. వెంటనే ఇంటికి వెళ్లి తలస్నానం చేస్తారు. మరికొందరైతే పనిని విరమించుకుని ఇంటికి తిరుగుముఖం పడతారు. 
 
నిజానికి ఇలా మనం బయటకు వెళ్లినప్పుడు శవం ఎదురైతే మాత్రం అది శుభసూచకం అని జ్యోతిష్యనిపుణులు అంటున్నారు. అదేంటి శవం ఎదురయితే శుభసూచకం ఎలా అని తలబద్ధలు కొట్టుకుంటున్నారా... నిజానికి పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానదు. ఎంతంటి గొప్పవంతులైనా... కండలు తిరిగిన వీరులైనా...చివరకు చేరేది భగవంతుడినే కాబట్టి జీవించి ఉన్న కొద్ది కాలంలో పరులకు మంచి చేయమని, తద్వారా మోక్ష సాధనకు మార్గం సులువు అవుతుందని మనకు ఎదురైన శవం బోధిస్తుంది అని వారంటున్నారు.
 
కాబట్టి ఈసారి శవం ఎదురొస్తే అశుభం అని భయపడకుండా..... వెనుదిరగి ఇంటికి వెళ్లడం కానీ చేయకండి...ఈ లోకంలో నువ్వు చేయాల్సిన మంచి పనే ఇంకా మిగిలే ఉందని ఆ శవం మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని అనుకుని కార్యసాధనకై బయలుదేరండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే గోశాలలో నెలకు 25 గోవులను చంపేస్తున్నారు...!