Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తితిదే గోశాలలో నెలకు 25 గోవులను చంపేస్తున్నారు...!

ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన ధార్మిక సంస్థ. ప్రతిరోజు రెండుకోట్ల రూపాయలకుపైగా ఆదాయం వస్తోన్న గొప్ప సంస్థ. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన సంస్థ ఆధ్వర్యంలో గోశాల. చెప్పే విధంగా బాగానే ఉన్నా అది మాత్రం ఏ విధంగానూ ఆచరణ సాధ్యం కావడం లేదు. కారణం తితిదే ఉన్నతాధిక

తితిదే గోశాలలో నెలకు 25 గోవులను చంపేస్తున్నారు...!
, బుధవారం, 6 జులై 2016 (18:52 IST)
ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన ధార్మిక సంస్థ. ప్రతిరోజు రెండుకోట్ల రూపాయలకుపైగా ఆదాయం వస్తోన్న గొప్ప సంస్థ. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన సంస్థ ఆధ్వర్యంలో గోశాల. చెప్పే విధంగా బాగానే ఉన్నా అది మాత్రం ఏ విధంగానూ ఆచరణ సాధ్యం కావడం లేదు. కారణం తితిదే ఉన్నతాధికారుల చేతకానితనం.
 
తితిదే ఆధ్వర్యంలో తిరుపతి గోశాల నడుస్తోంది. గోశాలలో పశువులతో పాటు ఏనుగులను తితిదే పోషిస్తోంది. అయితే ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది. పశువులకు ఏమాత్రం మేత వేయకుండా తితిదే సిబ్బంది గాలికి వదిలేస్తున్నారు. అంతేకాదు అపరిశుభ్రమైన నీరు.. వాతావరణం.. ఇలా ఒకటి కాదు.. ఎన్నో విధాలుగా గోశాల అస్తవ్యస్తంగా ఉంది. విషయం తెలుసుకున్న శాసనసభ అమలు హామీల కమిటీ తితిదే గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. గోశాలలోని సౌకర్యాలపై తితిదే జెఈఓను అడిగింది. 
 
అడగడమే కాదు కమిటీ ఛైర్మన్‌ వెంకటేష్‌తో పాటు సభ్యులు మొత్తం గోశాలనే తిరిగేశారు. పశువులకు దానా ఎక్కడేస్తున్నారు.. ఏనుగులకు తిండి ఎలా పెడుతున్నారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. అపరిశుభ్రంగా ఉన్న నీటిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు కమిటీ సభ్యులు. అంతేకాదు పశువులు దీనంగా రోగాలతో పడుకుని ఉండటాన్ని గమనించారు. 
 
తితిదే జెఈఓను నిలదీశారు. అసలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. గోశాల తీరు ఏమాత్రం బాగా లేదని, కనీసం గోపూజ కూడా ప్రతిరోజు చేయడం లేదన్నారు. ప్రతిరోజు గోపూజను ఖచ్చితంగా చేయాలని ఆదేశించారు. గోశాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది కమిటీ. ఇదే విషయాన్ని స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌తో పాటు సిఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామని కమిటీ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలపై డేగ కన్ను... 38 కొత్త పోస్టులు