Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2019వ సంవత్సరం ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు.. ఎప్పుడెప్పుడో తెలుసా?

2019వ సంవత్సరం ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు.. ఎప్పుడెప్పుడో తెలుసా?
, శనివారం, 5 జనవరి 2019 (12:55 IST)
2019వ సంవత్సరం మొత్తం ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సంపూర్ణ సూర్య గ్రహణాలు కాగా, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం. అలాగే ఒకటి పాక్షిక చంద్రగ్రహం, మరొకటి పాక్షిక సూర్యగ్రహణం. ఇక పదమూడేళ్లకు ఒకసారి సూర్యుడు కక్ష్యను దాటి బుధుడు సంచరిస్తాడు. ఇది 2019 నవంబరులో జరుగనుంది.
 
ఈ కొత్త ఏడాది ప్రారంభమైన తొలివారంలోనే సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది జరిగిన 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనుంది. జనవరి ఆరో తేదీ (ఆదివారం) పాక్షిక సూర్యగ్రహం ఏర్పడనుంది. ఇది ఆసియా, ఫసిఫిక్ తీరంలో దర్శనమిస్తోంది. భారత్‌లో మాత్రం ఈ గ్రహణం కనిపించేందుకు ఆస్కారం లేదు. ఇది జరిగిన 15 రోజుల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం జనవరి 21న ఏర్పడనుంది. ఇది కూడా అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది. 
 
జూలై 2న సంపూర్ణ సూర్య గ్రహణం, జూలై 16న పాక్షిక చంద్రగ్రహణం, డిసెంబ‌ర్ 26, 2019న ఏర్ప‌డే సూర్య గ్ర‌హ‌ణం ఏర్పడనున్నాయి. ఇందులో డిసెంబర్ 26న ఏర్పడే సూర్య గ్రహణం ద‌క్షిణ భార‌తదేశం, శ్రీలంక‌, కొన్ని గ‌ల్ఫ్ దేశాలు, సుమ‌త్రా, మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో క‌నిపించ‌నుంది. కానీ సంపూర్ణ సూర్యగ్రహణం కోసం మ‌రో 16 ఏళ్లు వేచి చూడాల్సి వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-01-2019 శనివారం దినఫలాలు - స్త్రీలు పనివారలతో చికాకులు...