Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హనుమజ్జయంతి: ఆదివారం ఇలా చేస్తే.. ఆపదలు పరార్..!

హనుమజ్జయంతి: ఆదివారం ఇలా చేస్తే.. ఆపదలు పరార్..!
, ఆదివారం, 17 మే 2020 (00:29 IST)
తెలుగు రాష్ట్రాల్లో హనుమజ్జయంతిని ఆదివారం (మే 17-2020)న జరుపుకుంటారు. హనుమజ్జయంతి రోజున హనుమ పుట్టిన రోజుగా ప్రజలు కొనియాడుతారు. రామబంటు అయిన హనుమంతుడి పుట్టిన రోజున ఆయనను నిష్ఠతో పూజించిన వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి.

ఆపదలు తొలగిపోతాయి. శ్రీరాముని కష్టకాలంలో సీతను అన్వేషించి ఆమె వున్న స్థలాన్ని రామునికి తెలిపిన ఆంజనేయుడు.. ఆపై రావణాసురుడి సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. హనుమ పుట్టుక రాముని భక్తిని పొందడం కోసమే. 
 
రామభక్తుడిగా చిరంజీవిగా ఈ లోకం వున్నంతకాలం రామ నామాన్ని స్తుతించే వారికి అండగా వుండేందుకే హనుమంతుడి అవతారం జరిగింది. అలాంటి హనుమజ్జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్లి సింధూరం ధరిస్తే.. దుష్టశక్తులు పారిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మనోధైర్యం చేకూరుతుంది. 
webdunia
Hanuman
 
తెలుగు రాష్ట్రాల్లో హనుమంత జయంతిని మే 17, 2020 (ఆదివారం) అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుని ఆలయంలో అర్చనలు, అభిషేకాలు చేయించి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇంకా చామంతి పూవులు, రోజా పువ్వులు పూజకు లడ్డూలు, హల్వాను నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే ఈ ఏడాది హనుమాన్ జయంతి పూజలకు పరిమితంగా భక్తులు హాజరవుతారు. 
 
కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలయాల్లో పూజలు జరుగుతున్నా.. భక్తులు భారీ స్థాయిలో హాజరయ్యే పరిస్థితి లేదు. కాగా తెలుగు ప్రజలు వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే పదో రోజున హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా 41 రోజుల దీక్షను చైత్ర పౌర్ణమి వరకు చేపడుతారు. రామునికి భక్తుడిగా, శ్రీకృష్ణుడికి కురుక్షేత్ర యుద్ధంలో సహకరించిన హనుమంతుడు.. కలియుగంలో గోసామి తులసీదాస్ ద్వారా రామనామాన్ని వ్యాపింపజేశాడు. 
 
భారతదేశంలో హనుమజ్జయంతి వేడుకలు :
మహారాష్ట్రలో చైత్ర పూర్ణిమ రోజున హనుమజ్జయంతి జరుపుకుంటారు. 
తమిళనాడు, కేరళలో పండగ నెల అంటే డిసెంబర్-జనవరి నెలల్లో వస్తుంది. 
ఒడిశాలో వైశాఖ మాసం తొలి రోజున జరుపుకుంటారు. 
ఆంధ్ర, కర్ణాటకల్లో వైశాఖ కృష్ణపక్షం పదో రోజున హనుమజ్జయంతి జరుపుకుంటారు. 
webdunia
hanuman jayanti
 
ఈ రోజున హనుమాన్ చాలీసా, సుందరకాండను పఠించిన వారికి ఆపదలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. రామదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమజ్జయంతి మే 17, ఆంజనేయుని ఎలా స్తుతించాలి?