Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హనుమాన్ జయంతి.. రామభక్తుడిని పూజిస్తే అంతా విజయమే

హనుమాన్ జయంతి.. రామభక్తుడిని పూజిస్తే అంతా విజయమే
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (10:58 IST)
హనుమాన్ జయంతి రోజున రామభక్తుడిని పూజించిన వారికి శుభ ఫలితాలుంటాయి. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు. చైత్ర శుక్ల పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున.. 
 
"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం.
 
అందుచేత చైత్ర శుక్ల పూర్ణిమ నాడు మాత్రమే గాకుండా ఆంజనేయ స్వామిని శనివారం, మంగళవారం ఇంకా గురువారాల్లో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి. ఒకసారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆంజనేయ స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు.
 
శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చునని పురోహితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-04-2020 బుధవారం దినఫలాలు - గాయిత్రి మాతను ఆరాధిస్తే...