Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

08-04-2020 బుధవారం దినఫలాలు - గాయిత్రి మాతను ఆరాధిస్తే...

08-04-2020 బుధవారం దినఫలాలు - గాయిత్రి మాతను ఆరాధిస్తే...
, బుధవారం, 8 ఏప్రియల్ 2020 (05:00 IST)
మేషం : భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాకపోవచ్చు. మీకు నచ్చిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాల పట్ల మెలకువ వహించండి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. 
 
వృషభం : పారిశ్రామికరంగాల వారికి కార్మికులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ అవరం. తలకు మించిన బాధ్యతలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త వహించండి. 
 
మిథునం : హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బాధ్యతలుల స్వీకరిస్తారు. స్త్రీలు గృహాలంకరణ, విలాస వస్తువుల పట్ల ఆసక్తి కనపరుస్తారు. 
 
కర్కాటకం : మీ విలాసాలకు ధనం అధికంగా వ్యయం చేస్తారు. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. గృహంలో మరమ్మతులు, మార్పులు చేపడతారు. స్త్రీలకు వాహనం నపుడుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
సింహం: వృత్తి వ్యాపారులకు సంతృప్తి. పురోభివృద్ధి. మీ మాటతీరును ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలు మీరే సమీక్షించుకోవడం క్షేమదాయకం. వాహనచోదకులకు మెలకువ వహించండి. స్త్రీలపై చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఆత్మీయులతో కలిసి విహార యాత్రలలో పాల్గొంటారు. 

కన్య : ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. దుబారా ఖర్చులు నివారించగలుగుతారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వాహనచోదకులకు మెలకువ వహించండి. స్త్రీలపై చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఆత్మీయులతో కలిసి విహార యాత్రల్లో పాల్గొంటారు. 
 
తుల : రాజకీయ కళా రంగాల వారికి అనుకూలం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు చేర్పులు చేపడతారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. 
 
వృశ్చికం : దైవ, సేవా కార్యక్రమాలలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. రావలసిన ధనం అందడంతో మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
ధనస్సు : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు, క్రీడా రంగాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఆస్తి, వ్యవహారాల్లో సోదరులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
మకరం : సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. చేస్తున్న పనిపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. 
 
కుంభం : స్త్రీల, షాపింగ్‌లోనూ, చెల్లింపుల్లోనూ అప్రమత్తత అవసరం. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇతరులతో మాట్లాడేటపుడు మనస్సు విప్పి మాట్లాడటం మంచిది. వృత్తి ఉద్యోగ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఆత్మీయులతో వేడుకలు, వినోదాలలో పాల్గొంటారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
మీనం : ఏ పనైనా మొదలుపెట్టే ముందు అన్ని రకాలుగా ఆలోచనలు చేయండి. రాజకీయ కళారంగాల వారిక సామాన్యంగా ఉంటుంది. పాత రుణాలు తీరుస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు ఆచి, తూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

07-04-2020 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని తమలపాకులతో...