శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. శుక్రవారం సాయంత్రం పూజతో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శుక్రవారం సాయంత్రం దంపతులిద్దరూ కలిసి లక్ష్మీదేవి పూజలో పాల్గొన్నట్లైతే.. ఆ పూజ చేసినట్లైతే వైవాహిక బంధం సాఫీగా సాగిపోతుంది.
లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రంలో మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు. తద్వారా డబ్బుకు కొరత వుండదు.
శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వశుభాలు జరుగుతాయి. అలాగే ఇంటి వద్దకు వచ్చే ఆవులకు శుక్రవారం మేత ఇవ్వడం చేస్తే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శుక్రవారం రోజు మీరు ఆహారం తీసుకునే ముందుకు నెయ్యి, బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు.
ఇల్లాలిని ఇంటికి మహాలక్ష్మీగా పూజిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం పురుషులకు తమ సతీమణికి సువాసనతో కూడిన పువ్వులను, స్వీట్లను తెచ్చి పెట్టండి. ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం మీరు పొందుతారు.
అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఏ ఇంట మహిళ సంతోషంతో మానసిక బలంతో వుంటుందో ఆ ఇంట మహాలక్ష్మీదేవి నివాసం వుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.