Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి... ఏం చేయాలి...?

ఆర్థిక స్థిరత్వం లేక కొందరు, సంపాదించిన సొమ్ము చేతిలో నిలువక మరికొందరు సతమతమవుతుంటారు. ఐతే అలాంటి వారు కొన్ని సూచనలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయని, సంపాదన చేతిలో నిలుస్తుందని పెద్దలు చెబుతుంటా

Advertiesment
ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి... ఏం చేయాలి...?
, శనివారం, 20 ఆగస్టు 2016 (16:20 IST)
ఆర్థిక స్థిరత్వం లేక కొందరు, సంపాదించిన సొమ్ము చేతిలో నిలువక మరికొందరు సతమతమవుతుంటారు. ఐతే అలాంటి వారు కొన్ని సూచనలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయని, సంపాదన చేతిలో నిలుస్తుందని పెద్దలు చెబుతుంటారు.  ఎల్లో కౌరీస్ (Yellow Cowries) అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన గ‌వ్వ‌ల‌ను ఏడింటిని ఎప్పుడు జేబులో ఉంచుకుంటే  ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంది. అట్లే గోమ్తి చ‌క్ర అని పిల‌వ‌బ‌డే గ‌వ్వ‌ల‌ను బేసి సంఖ్య‌లో ద‌గ్గ‌ర ఉంచుకున్నా ఆర్థికంగా లాభం జ‌రుగుతుంద‌ట‌. 
 
వీరికి శ‌త్రువుల నుంచి బాధ కూడా త‌ప్పుతాయని పెద్దలు అంటారు. తామ‌ర‌పూవు విత్త‌నాల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటున్నా ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంద‌ట‌. అలాంటి వారికి ఖ‌ర్చులు త‌గ్గుతాయ‌ట‌. పిప్ప‌ళ్ల చెట్టు(రావి చెట్టు) ఆకును ఒక దాన్ని శ‌నివారం పూట తీసుకుని, నీటితో శుభ్రంగా క‌డిగి, ఆ ఆకుపై హ్రీం అని రాసి ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందుల‌న్నీ తొల‌గిపోతాయి.  
 
రూ.20 నోటు ఒక‌టి, రెండు రూపాయి నోట్లు తీసుకుని వాటిని వెండి తీగ‌తో క‌లిపి చుట్టి తెలుపు రంగు ప‌ర్సులో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోయి ఖ‌ర్చులు త‌గ్గుతాయి. ఆర్థిక స్థిర‌త్వం ఏర్ప‌డుతుంది. ల‌క్ష్మీ దేవికి బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోతాయి. ధ‌నం బాగా స‌మ‌కూరుతుంది. శ్రీ‌యంత్రాన్ని ఎల్ల‌ప్పుడూ ద‌గ్గ‌ర ఉంచుకున్నా అంతా మంచే జ‌రుగుతుంది. అలాంటి వారికి డ‌బ్బు ప‌రంగా ఉన్న అన్ని స‌మ‌స్య‌లు పోతాయి. 
 
ల‌క్ష్మీ దేవి ఫొటోను ద‌గ్గ‌ర పెట్టుకున్నా, విష్ణువు పాదాల‌ను ముట్టుకున్నా అలాంటి వారికి అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. వారికి ఉన్న ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. కోడిగుడ్డు ఆకారంలో ఉండే తెల్ల‌ని వైట్ స్టోన్‌ను ద‌గ్గ‌ర ఉంచుకుంటే అది పాజిటివ్ శ‌క్తిని ఇస్తుంద‌ట‌. అలాంటి వారికి ప్ర‌శాంతత కూడా క‌లుగుతుంద‌ట‌. దీనికితోడు వారి ఆర్థిక స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. ఏదైనా శుక్ర‌వారం రోజు చిన్న‌పాటి కొబ్బ‌రికాయ‌తో ల‌క్ష్మీ దేవికి పూజ చేసి ఆ కొబ్బ‌రికాయ‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. ఇలా చేసినా ఆర్థిక స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైల ఆలయంలో ప్రతిధ్వనించే తుమ్మెద ఝంకార నాదం... శ్రీచక్రం అక్కడే...