Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇల్లాలిని జుట్టుపట్టుకుని కొడ్తున్నారా?

ఇంట్లో ఇల్లాలు ఎంత ఆరోగ్యంగా, ఆనందంగా వుంటే ఆ ఇంట మహాలక్ష్మిదేవి కొలువై వుంటుందని.. పండితులు చెప్తున్నారు. ఏ ఇంట ఇల్లాలు సంతోషంగా.. ఒత్తిడి లేకుండా, ఆందోళన పడకుండా ప్రశాంతంగా వుంటుందో ఆ ఇంట శ్రీ మహాలక

Advertiesment
ఇల్లాలిని జుట్టుపట్టుకుని కొడ్తున్నారా?
, సోమవారం, 16 జులై 2018 (11:13 IST)
ఇంట్లో ఇల్లాలు ఎంత ఆరోగ్యంగా, ఆనందంగా వుంటే ఆ ఇంట మహాలక్ష్మిదేవి కొలువై వుంటుందని.. పండితులు చెప్తున్నారు. ఏ ఇంట ఇల్లాలు సంతోషంగా.. ఒత్తిడి లేకుండా, ఆందోళన పడకుండా ప్రశాంతంగా వుంటుందో ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి కొలువైవుంటుంది.


పురుషుడు ఎంత సంపాదించి తెచ్చినా, పిల్లలు ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంట్లో వున్న ఇల్లాలికి గౌరవం ఇవ్వాలని. ఆమె చేతుల మీదుగానే అన్నీ జరగాలి. అప్పుడే ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఆడవారిపై చేజేసుకోకూకడదు. 
 
ఆడవారిపై ఎప్పుడు ప్రతాపం చూపించకూడదు. వారితో ఎలాబడితే అలా మాట్లాడకూడదు. వారిపట్ల మృదువుగా వ్యవహరించారు. ముఖ్యంగా మహిళలను జుట్టుపట్టుకుని కొట్టడం చేయకూడదట. జుట్టును మహిళలు విరబోసుకోకూడదు. జుట్టు ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది. జుట్టు విరబోసుకుని నిద్రించడం, గుడికి వెళ్లడం కూడదు. 
 
అలాగే పురుషులు ఆడవారి జుట్టు పట్టుకుని లాగడం.. కొట్టడం చేయకూడదు. ఇలా చేస్తే.. వినాశనం కలుగక తప్పదు. రావణుడు సీతమ్మ జుట్టును పట్టుకుని లాగడం ద్వారానే, పంచాలీని కౌరవులు జుట్టు పట్టుకుని సభకు లాక్కుని రావడం వల్లే వారి వంశాలు నాశనమయ్యాయి. అలాగే కంసుడు దేవకీ దేవి జుట్టు ముడి పట్టుకొని సంహరించేందుకు ప్రయత్నిస్తాడు. 
 
కానీ వసుదేవుడు ఆమె కడుపున పుట్టే 8వ సంతానాన్నిస్తాడని.. చెప్తాడు. అయినా దేవకీ దేవి జుట్టు పట్టుకున్న పాపానికి కంసుడు శ్రీకృష్ణుడిచే హతమవుతాడు. ఇలాంటి ఘటనలు పురాణాల్లో ఎన్నో వున్నాయి. అందుకే మహిళలను జుట్టుపట్టుకుని ప్రతాపం చూపించకూడదని.. అలా చేసే అశుభఫలితాలు తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోమవారం (16-07-2018) దినఫలాలు - ఒంటరిగానే లక్ష్యాలను..