Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-09-2019- శుక్రవారం దినఫలాలు - ఊహించని ఒత్తిడి, చికాకులు...

Advertiesment
20-09-2019- శుక్రవారం దినఫలాలు - ఊహించని ఒత్తిడి, చికాకులు...
, శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (08:56 IST)
మేషం: వృత్తి, ఉద్యోగాలల్లో నూతన బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో ఉంటుంది. కుటుంబంలో ఏర్పడిన వాదనలను పట్టించుకోకపోవడం మంచిది. ప్రేమించేవారితో గడుపుతారు. పెద్దల ఆరోగ్యము పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అనవసరపు ఖర్చులను తగ్గించుకొండి.
 
వృషభం: వాదనలు, పోట్లాటల్లో మీ శక్తిని వృధా చేసుకుంటారు. పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. వాహనం నడుపునపుడు మెళుకువ చాలా అవసరం. కళలు, సాహిత్య రంగాల వారు కొత్త ప్రయోగాలు చేస్తారు. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొనే ముందు భవిష్యత్తు పరిణామాలు ఆలోచించండి. 
 
మిధునం: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగును. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఊహించని ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. మీ కష్టం ఫలించినందుకు ఆనందంగా ఉంటారు. అయితే మీ బాధ్యతలను మరువకండి. 
 
కర్కాటకం: దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. ప్రలోభాలకు లొంగవద్దు. కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ, గొఱ్ఱెల రంగాలలో వారికి అనుకున్నంత సంతృప్తి కానరాదు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
సింహం: ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బంధువులను కలుసుకుంటారు.  మీరు ఎలాంటి భావన కలిగి ఉంటారో అలాంటి ఫలితాలే పొందుతారని గమనించగలరు. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు.
 
కన్య: స్త్రీలు టి. వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. పారిశ్రామిక రంగంలోని వారికి అనువైన పరిస్థితులేర్పడగలవు. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. మీ మంచిమాట తీరువల్ల బంధుమిత్రుల ఆదరాభిమానాలు పొందగలుగుతారు. రచయితలకు పత్రికా రంగంలో వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
 
తుల: ఏకాంతంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు అదుపుకోకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. కుటింబీకుల ఆరోగ్యంలో ఆందోళన కలిగిస్తుంది. బంధు మిత్రుల నుంచి అపనిందలు, అవమానాలను ఎదుర్కుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం: విందులు, దైవ, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీరు అభిమానించే వ్యక్తులను కలుసుకుంటారు. ప్లీడరు ప్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. కీలకమైన వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించండం మంచిది. నిరుద్యోగులకు దూరప్రాంతాల నుండి సదవకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు: కూర, పండ్ల, పూల వ్యాపారస్తులకు జయం చేకూరగలదు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. సోదరి, సోదరులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. నిర్ణయాలను తీసుకోవడం వాటిని సరిగా అమలు చేయడం పై దృష్టి సారించండి.  
 
మకరం: ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. రాజకీయనాయకులకు సభలు, సత్కార్యాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులు మిమ్మల్ని మధ్యవర్తిత్వం వహించమని కోరతారు మెళకువ అవసరం. పాతబిల్లులు చెల్లిస్తారు.
 
కుంభం: మీ జీవిత భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి బకాయిల వసూలు విషయంలో సమస్యలు తప్పవు. క్రయ విక్రయ దార్లకు అనుకూలంగా ఉండును. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది.
 
మీనం: కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు నిరుత్సాహపరుస్తాయి. బదిలీలు, మార్పులు, చేర్పుల గురించి ఓ నిర్ణయం తీసుకుంటారు. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థలలోని వారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19-09-2019 గురువారం రాశిఫలాలు - మితంగా సంభాషించడం వల్ల...