Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

14-02-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించినా...

14-02-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించినా...
, శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (05:00 IST)
మేషం : వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను ఆధికమిస్తారు. మీపై అభియోగాలు తొలగిపోగలవు. ఉద్యోగస్తుల పదోన్నతి, బదిలీలకు మార్గం సుగమం అవుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. మీ ప్రమేయం లేకున్నా కొన్ని విషయాలకు బాధ్యత వహించాల్సి వుంటుంది. 
 
వృషభం : విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకోగలుగుతారు. మీకు తెలియకుండానే పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. విద్యార్థులకు ఒత్తిడి, శ్రమ అధికం. వృత్తిపరంగా ప్రజా సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు నుంచి విముక్తి లభిస్తుంది. 
 
మిథునం : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రుణాలు తీర్చి తాకట్టు విడిపించుకుంటారు. నూతన పెట్టుబడులు, సంస్థలు, ప్రాజెక్టుల స్థాపనలకు మరికొంతకాలం ఆగటం మంచిది. బంధు మిత్రుల వైఖరి నిరుత్సాహపరుస్తుంది. సతానం విద్యా విషయాలపై శ్రద్ధ వహిస్తారు. 
 
కర్కాటకం : ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. తాకట్టుపై రుణాలు స్వీకరిస్తారు. మీ యత్నాలు గుట్టుగా సాగించండి. అధికారులు అభియోగాలు, వ్యతిరేక ఎదుర్కొంటారు. వ్యవహార ఒప్పందాల్లో ఖచ్చితంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా పాటించడం ఉత్తమం. పనులు వాయిదావేసిన ఇబ్బందులకు గురవుతారు. 
 
సింహం : విలాస వస్తువుల కొనుగోలుకు ధనం బాగా వ్యయం చేస్తారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు కావలసిన వనరులు, లైసెన్సులు సమకూర్చుకుంటారు. ఆడిటర్లు, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం. ప్రయాణాల్లో మెలకువ వహించండి. సభలు, సమావేశాలు వాయిదాపడే సూచనలున్నాయి. 
 
కన్య : ఎల్.ఐ.సి ఏజెంట్లు, మార్కెట్ రంగాలవారికి ఒత్తిడి అధికం. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావ వస్తుంది. ఒక పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఇతరులకు సలహా ఇచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. అధికారులకు మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి. 
 
తుల : ముఖ్యమైన వ్యవహారాలు, బాధ్యతల్లో చికాకులు అధికం. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. కార్యసాధనంలో ఒడిదుడుకులను అధికమిస్తారు. పనులు సకాలంలో పూర్తికాగలవు. ఖర్చులు సామాన్యం. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. 
 
వృశ్చికం : బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులకు ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల ప్రశంసలు లభిస్తాయి. బిల్లులు చెల్లిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. నోటీసులు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. 
 
ధనస్సు : ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు సంభవం. అయినవారితోనైనా ఖచ్చితంగా ఉండాలి. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, తగిన అవకాశం కలిసివస్తుంది. నిరుద్యోగులు ఆశాదృక్పథంతో యత్నాలు సాగించాలి. మీ సమర్థతకు గుర్తింపు లభించక నిరుత్సాహం చెందుతారు. లైసెన్సుల రెన్యువల్, లీజు పొడగింపుల్లో అశ్రద్ధ తగదు. 
 
మకరం : దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. షాపుల స్థల మార్పిడి, గృహ వాస్తుదోష నివారణ వల్ల మంచి ఫలితాలుంటాయి. ఒక సమస్య పరిష్కారం కావడంతో మనసు తేలికపడుతుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బంధు మిత్రులకు మీపై మరింత అభిమానం కలుగుతుంది. 
 
కుంభం : స్థిరాస్తి విక్రయంలో ఆటంకాలు తొలగిపోగలవు. వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా పూడ్చుకుంటారు. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. అధికారుల ఇంటర్వ్యూ అనుకూలించదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. మీ సంతానం కోసం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. 
 
మీనం : కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. దేనిపైనా మనస్సు లగ్నం చేయలేరు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహా శివరాత్రి... ఈ ఐదు పనులు అస్సలు చేయకండి.. ఎందుకు..?