Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13-07-2020 సోమవారం రాశిఫలాలు - విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు...

Advertiesment
13-07-2020 సోమవారం రాశిఫలాలు - విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు...
, సోమవారం, 13 జులై 2020 (05:00 IST)
మేషం : హోటల్, తినుండరాల వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. 
 
వృషభం : నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు వేధింపులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్‌లో పైచదువులకు అవకాశం లభిస్తుంది. మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష. ఏ వ్యవహారంలోనూ, ఇతరులపై అతిగా ఆధారపడటం మంచిదికాదు .
 
మిథునం : ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత ప్రయాసలెదుర్కొంటారు. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదావేసుకోవలసి వస్తుంది. 
 
కర్కాటకం : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రుణాల కోసం అన్వేషిస్తారు. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. చిన్నారుల, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
సింహం : మీ కార్యక్రమాలు, పనులు వాయిదావేసుకోవలసి వస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యంకాదు. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. మీ చుట్టుపక్కల వారితో సంభాషించేటపుడు జాగ్రత్త అవసరం. 
 
కన్య : ఆర్థిక విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రాజకీయాలలోని వారు విరోధులు వేసే పథకాలకు తిప్పికొడతారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గానీ చేపట్టిన పనులు పూర్తికావు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఎదుటివారికి వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. 
 
తుల : స్త్రీలకు టీవీ ఛానెళ్లు నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల సమాచారం అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో మధ్యవర్తిత్వం వహించుట వల్ల మాటపడవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరులను సహాయం అర్థించి భంగపాటుకు గురవుతారు.
 
వృశ్చికం : స్థిరాస్తి క్రయ, విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెంపుడు జంతువుల విషయాల్లో మెళకువ అవసరం. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటా బయటా మీ మాటకు స్పందన లభిస్తుంది. 
 
ధనస్సు : పత్రికా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పెన్షన్, బీమా పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు పాఠ్యాంసాలు పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. 
 
మకరం : ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటరు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం సంతృప్తికరంగా ఉండదు. దైవదర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
కుంభం : శెనగలు, కంది, చింతపండు, బెల్లం వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. మత్స్య, కోళ్ల, గొర్రెల వ్యాపారస్తులకు మెళకువ వహించండి. 
 
మీనం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు సంతృప్తినిస్తాయి. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదేలో 91 మంది ఉద్యోగులు - తిరుమల యాత్ర రద్దు చేసుకుంటున్న భక్తులు