09-07-2020 గురువారం రాశిఫలాలు

గురువారం, 9 జులై 2020 (05:00 IST)
మేషం : ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. ఒకే అభిరుచి కలిగిన వ్యక్తుల కలయిక జరుగును. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. బంధు మిత్రుల కలయిక వల్ల సంతృప్తినిస్తుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. 
 
వృషభం : ఆర్థిక విషయాలలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఉమ్మడి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు క్లయింట్లతో చికాకులు తప్పవు. 
 
మిథునం : ఆర్థిక విషయాల్లో సంతృప్తి. దైవదర్శనాలు, మొక్కుబడులు చెల్లిస్తారు. విద్యార్థులకు ఇంజనీరింగ్, వైద్య కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికం. ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డంకులు తొలగిపోగలవు. రవాణా ద్వారా ఊహించని లాభాలను పొందుతారు. 
 
కర్కాటకం : దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. బ్యాంకు పనుల్లో ఒత్తిడి, జాప్యం ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. 
 
సింహం : వాహన చోదకులకు ఆటుపోట్లు తప్పవు. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ అనుకూలిస్తుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు తీర్పులు, పెద్ద నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటాయి. 
 
కన్య : కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలో పెద్ద సమస్య అనిపిస్తాయి. పత్రికా సంస్థలలోని వారికి కీలకమైన వార్తల ప్రచురణలో ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. నూతన పరిచయస్తులను తరచూ పలకరించడం ఉత్తమం. వారి సహాయం ఏ క్షణంలో అయినా అవసరమనిపించవచ్చు. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
తుల : ఉద్యోగస్తులు తోటివారితో మితంగా సంభాషించడం ఉత్తమం. ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. బంధువుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులెదుర్కొంటారు. ఏ వ్యవహారం కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. 
 
వృశ్చికం : భాగస్వామికులతో అభిప్రాయభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి. ఓర్పుతోనే మీ పనులు సానుకూలమవుతాయి. కళా, సాంస్కృతిక, బోధన, విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 
 
ధనస్సు : ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్యులు కోసం షాపింగ్‌ చేస్తారు. బంధువు నుంచి పేరు, ఖ్యాతి పొందుతారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. ఏ యత్నం ఫలించక నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు. 
 
మకరం : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉన్నతాధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉడటం క్షేమదాయకం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాణిజ్య ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో సావకాశంగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 
 
కుంభం : ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలించవు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల నిమిత్తం బాగా శ్రమించాలి. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. ఒకసారి చేజారిన అవకాశం మళ్లీ రాదని గమనించండి. 
 
మీనం : ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీల అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో సమస్యలు తలెత్తుతాయి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలపై కరోనావైరస్ పడగ