Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-11-2018 సోమవారం దినఫలాలు - ధనరాబడిని అన్వేషించి...

Advertiesment
Daily Horoscope
, సోమవారం, 12 నవంబరు 2018 (08:42 IST)
మేషం: ఆర్థికంగా అభివృద్ధి చేకూరుతుంది. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందిన వారి లక్ష్యాలు సాధిస్తారు. స్థిరాస్తిని అమ్మటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కుంటారు. స్త్రీలు దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. 
 
వృషభం: గృహంలో ఏదైనా వస్తువుల పోవుటకు అవకాశం ఉంది. పత్రికా రంగాల్లో వారికి చికాకులు అధికమవుతాయి. భార్యా, భర్తల మధ్య ఉన్న చికాకులు తొలగిపోతాయి. ఇతరుల వలన ప్రభుత్వ అధికారుల చేత మాటపడక తప్పదు. ఊహించన దానికంటే అధిక రాబడి పెరుగును. శత్రువులపై విజయం సాధిస్తారు.  
 
మిధునం: పసుపు, శెనగ, నూనె, మిర్చి వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు లాభదాయకం. బంధుమిత్రుల నుండి అందిన ఆహ్వానాలు మీకెంతో సంతృప్తినిస్తాయి. దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్, ఎల్.ఐ.సి రంగాల వారికి కలిసివచ్చును. భాగస్వామ్యుల మధ్య అనురాగ వాత్సల్యాలు వృద్ధి చెందుతాయి.  
 
కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలు విలువైన బంగారు వస్తువులపై దృష్టి సారిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. అన్ని విషయాలందు ధనరాబడిని అన్వేషించి నడుచుకుంటారు. ఆఫీసులో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులకు ఆశాజనకం.     
 
సింహం: కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ప్రైవేటు సంస్థల్లోని వారికి తోటివారితో లౌక్యం అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి.  
 
కన్య: కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యం. ఖర్చులు అదుపు చేయాలనే మీ యత్నాలు అనుకూలించవు. స్టేషనరీ, ఫ్యాన్సీ, గృహోపకరణాల వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.  
 
తుల: ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదనే చెప్పవచ్చు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.  
 
వృశ్చికం: హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. విదేసీ వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. ప్రియతముల కోసం ధనం బాగా వెచ్చించవలసి వస్తుంది. ప్రభుత్వం నందు పనిచేయు ఉద్యోగులకు లాభాలు చేకూరును. ఏకాగ్రతతో కృషి చేసిన మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది.    
 
ధనస్సు: నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ వహించండి. క్రయవిక్రయ రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. వాహన చోదకులకు మెళకువ అవసరం. ఋణప్రయత్నం వాయిదా పడుతుంది.  
 
మకరం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదవకాశాలు లభిస్తాయి. ముఖ్యుల ద్వారా మీ పనులు నెరవేర్చుకొనుటకై చేయు యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. గృహంలో మార్పులు చేస్తారు. మీ సంతానం అతిగా వ్యవహరించడం వలన మాటపడక తప్పదు.  
 
కుంభం: ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు, ఏజెంట్లకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. విదేశాలకు వెళ్ళె యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం దిశగా మీ ఆలోచనలుంటాయి. బ్యాంకు వ్యవహారాలు సానుకూలమవుతాయి.  
 
మీనం: స్త్రీలకు నూనత ఉత్తాహం చోటుచేసుకుంటుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆడిటర్లకు, డాక్టర్లకు శుభ ప్రదంగా ఉండగలదు. ఖర్చులు ముందుగానే ఊహించినవి కావడంతో ఇబ్బందులు తలెత్తవు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం క్షేమదాయకం. వస్త్ర వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

100 మంది కౌరవుల పేర్లు మీకు తెలుసా?