Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

4-02-2018 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరం

మేషం: దీర్ఘకాలిక పెట్టుబడులు, భాగస్వామిక వ్యాపారాల విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది

4-02-2018 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరం
, ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (06:23 IST)
మేషం: దీర్ఘకాలిక పెట్టుబడులు, భాగస్వామిక వ్యాపారాల విషయంలో పునరాలోచన మంచిది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా సాగుతాయి.
 
వృషభం: విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించినట్లైతే లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ శ్రీమతితో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. పాతమిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మిథునం: వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. ముఖ్యలలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది.
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు క్రమంగా తొలగిపోగలవు. 
 
సింహం: బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. రాజకీయ నాయకులు తరచు సభాసమావేశాల్లో పాల్గొంటారు. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. 
 
కన్య: మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. మీ సంతానం వివాహ, విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంత శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
తుల: ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల రాకతో వస్త్ర, విలువైన వస్తువుల కొనుగోళ్ళ నిమిత్తం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
వృశ్చికం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 
 
ధనస్సు : పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. స్త్రీలు చేపట్టిన పనుల్లో చికాకులు, అవాంతరాలు ఎదుర్కొంటారు. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత ముఖ్యం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
మకరం: ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా సాగుతాయి. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి సలహా పాటించటం వల్ల మేలు జరిగే అవకాశం ఉంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. సహోద్యోగులు సహకరించక పోవటంతో నిరుత్సాహం చెందుతారు. వాహనం ఇతరులకు ఇవ్వటం మంచిది కాదు.
 
కుంభం: వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండటం మంచిది కాదు. ఓర్పు, చాకచక్యంతో చిక్కు సమస్యలను సరిచేసుకుంటారు. కుటుంబీకులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
మీనం : ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. అకాలభోజనం, శ్రమాధిక్యత వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రియతముల రాక మీకెంతో సంతృప్తినిస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెదక్ జిల్లా ఆ ఆలయంలోని కుండలోకి కాశీ నుంచి పుణ్యతీర్థం వస్తుంది...