Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళవారం దినఫలాలు :: స్త్రీలు రచనలు, కళాత్మక పోటీల్లో...

మేషం : స్త్రీలకు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం కూడదు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. సంఘంలో మీకు పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వస్త్ర, పచారీ, ఫ్య

మంగళవారం దినఫలాలు :: స్త్రీలు రచనలు, కళాత్మక పోటీల్లో...
, మంగళవారం, 30 జనవరి 2018 (08:27 IST)
మేషం : స్త్రీలకు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం కూడదు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. సంఘంలో మీకు పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
వృషభం : వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ప్రేమికుల ఎడబాటు, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. స్త్రీలు, రచనలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. 
 
మిథునం : ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. దీర్ఘకాలికంగా వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
కర్కాటకం : మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. రుణ బాధలు తొలగిపోతాయి. ప్రశాంతత చేకూరుతుంది. మీ శ్రీమతి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
సింహం : విద్యార్థులు కొన్ని నిర్బంధాలకు లోనవుతారు. ప్రైవేట్ ఫైనాన్స్‌లో పొదుపు, వ్యక్తుల రుణాలు క్షేమం కాదు. స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. అవగాహన లేని వ్యాపారులు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
కన్య : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తులకు తోటివారితో సమన్వయం లోపిస్తుంది. బంధువులతో పట్టింపులు వీడి సంబంధాలు పెంచుకుంటారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. 
 
తుల : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. 
 
వృశ్చికం : చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. క్రీడా, కళ, రచన, పత్రికా రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. 
 
ధనస్సు : ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. మీలోని శక్తిసామర్థ్యాలు ద్విగుణీకృతమయ్యే అవకాశం దక్కుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. 
 
మకరం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కులు పరిష్కారమవుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
కుంభం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి. కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. 
 
మీనం : సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. మీ సంతానం భవిష్యత్ కోసం పొదుపు పథకాలు చేపడతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పారిజాత వృక్షంపై వైరల్ అవుతున్న సమాచారం.. ఏంటది?