రాశి ఫలితాలు( 23-06-17)... మొహమాటాలకు, ఒత్తిళ్లకు తావివ్వొద్దు..
మేషం : వృత్తుల వారికి సదావకాశాలు లభించినా ఆశించినంత సంతృప్తి ఉండదు. ఉద్యోగస్తులు ఆశిస్తున్న పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. కాట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. రావలసిన ధనం అందడంతో కుదుటపడతారు. అనుకున్న పనులు కొంత ఆలస్యమైనా సంతృప్త
మేషం :
వృత్తుల వారికి సదావకాశాలు లభించినా ఆశించినంత సంతృప్తి ఉండదు. ఉద్యోగస్తులు ఆశిస్తున్న పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. కాట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. రావలసిన ధనం అందడంతో కుదుటపడతారు. అనుకున్న పనులు కొంత ఆలస్యమైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
వృషభం
మీ పథకాలు, ప్రణాళికలు గోప్యంగా ఉంచండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. ఇతరుల వాహనం నడపడం వల్ల ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. ఉద్యోగస్తులు మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మిథునం
విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. అనవసరపు వివావాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం
మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. హామీలు ఇచ్చే విషయంలోనూ, మధ్యవర్తిత్వ వ్యవహారాలలో మెళకువ వహించండి. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, ఆందోళన తప్పదు. మీ శ్రీమతి ఓదార్పుతో మీలో మనోధైర్యం నెలకొంటుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
సింహం
ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురైనా మనశ్శాంతి లోపిస్తుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వస్తువు కొనుగోలులో నాణ్యత గమనించాలి. గత అనుభవాలతో లక్ష్యాలు సాధిస్తారు.
కన్య
దీర్ఘకాలికంగా వాయిదాపడుతూ వస్తున్న పనులు పూర్తి కాగలవు. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.
తుల
వృత్తి వ్యాపారాల్లో మొహమాటాలకు, ఒత్తిళ్లకు తావివ్వొద్దు. మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం.
వృశ్చికం
ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాతావారణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి విందులు, దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
ధనస్సు
రాజకీయ, కళలు, సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన లేక చికాకులు వంటివి ఎదుర్కొంటారు. డాక్టర్లు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలతో కొత్త వ్యక్తులతో తక్కువగా సంభాషించడం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం అధికం.
మకరం
బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఆర్థికంగా బాగున్నా మానసికంగా ప్రశాంతత అంతగా ఉండదు. విద్యార్థులు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో మెళకువ వహించండి.
కుంభం
వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కవి, పండితులకు, కళాకారులకు సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. రుణాలు తీర్చి తాకట్టులు విడిపించుకుంటారు. మిత్రుల వల్ల మీ కార్యక్రమాలు వాయిదాపడతాయి.
మీనం
బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. మీరు ప్రతి పనినీ స్వయంగా చేయడం వల్ల సుఖపడతారు.