Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మవారిని గరికతో, మహాలక్ష్మిని ఉమ్మెత్త పువ్వులతో పూజించకూడదట

పుష్పాలు అంటేనే మనకు గుర్తుకొచ్చేది రంగు, సువాసన గుర్తుకొస్తుంది. సుతిమెత్తగా, మృదువుగా వుండే ఈ పుష్పాలు దేవతా పూజకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుష్పాలను మనస్ఫూర్తిగా సమర్పించడం ద్వారా, పుష్పార్చన ద్వారా దే

అమ్మవారిని గరికతో, మహాలక్ష్మిని ఉమ్మెత్త పువ్వులతో పూజించకూడదట
, గురువారం, 22 జూన్ 2017 (16:38 IST)
పుష్పాలు అంటేనే మనకు గుర్తుకొచ్చేది రంగు, సువాసన గుర్తుకొస్తుంది. సుతిమెత్తగా, మృదువుగా వుండే ఈ పుష్పాలు దేవతా పూజకు ఎంతగానో ఉపయోగపడతాయి. పుష్పాలను మనస్ఫూర్తిగా సమర్పించడం ద్వారా, పుష్పార్చన ద్వారా దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని పుష్పాలను మాత్రమే పూజకు ఉపయోగించాలని వారు చెప్తున్నారు. 
 
వాసన లేని పుష్పాలను దేవతామూర్తులకు సమర్పించకూడదు. విఘ్నేశ్వరుడికి తులసీతో పూజ చేయకూడదు. అయితే చతుర్థి రోజున మాత్రం తులసీ దళాలతో వినాయకుడికి పూజ చేయవచ్చు. ఇందుకు ధర్మధ్వజ యువరాణి విఘ్నేశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరడం అందుకు ఆయన నిరాకరించడం ఆపై.. ఆమె వినాయకుడికి బ్రహ్మచారిగా వుండిపోవాల్సిందిగా శాపమిస్తుంది. వినాయకుడు కూడా ధర్మధ్వజ యువరాణి రాక్షసుల చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతి శాపం ఇస్తాడు. ఆపై తన తప్పును తెలుసుకున్న ధర్మధ్వజ యువరాణి శాప విముక్తి కోరుతుంది. 
 
వినాయకుడు శాంతించి, రాక్షసుని చెంత కొంతకాలం ఉండి, ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావని చెప్తాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజ ఇష్టపడడు. ఇంకా తులసి వినాయక పూజ ఆశించిన ఫలితాలను ఇవ్వదట. అందుకే తులసిని వినాయకుడి పూజలో ఉపయోగించకూడదు. గరికతో పాటు ఇతర పుష్పాలతో అర్చించవచ్చు. అలాగే విష్ణుమూర్తిని గన్నేరు పువ్వులతో పూజించకూడదు. శివునికి సువాసనలు వెదజెల్లే మొగలిపూవుతో అర్చించకూడదు. అయితే శివరాత్రి పూట ముక్కంటికి మొగలిపూవులతో అర్చించవచ్చు.
 
అమ్మవారికి గరికతో పూజ చేయకూడదు. మహాలక్ష్మీ దేవికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయకూడదు. దుర్గాదేవికి గరిక మాల సమర్పించకూడదు. సూర్య భగవానునికి బిల్వ అర్చన పనికిరాదు. భైరవుడికి మల్లెపువ్వులతో పూజ చేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
 
ఈ పుష్పాలతో పూజ చేయవచ్చు.. 
అయితే వినాయకుడికి గరికతో పాటు మందారం, తామర, రోజా పువ్వులతో పూజ చేయడం ద్వార సుఖసంతోషాలు చేకూరుతాయి. కుమారస్వామిని మల్లెలు, సన్నజాజి, చామంతి రోజా పువ్వులతోనూ.. దుర్గాదేవిని మల్లెలు, సన్నజాజి, తెల్ల తామర పువ్వులతో పూజలు చేస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరి..