Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ రాశిఫలాలు(24-06-2017)... దైవ దర్శనంతో మానసిక ప్రశాంతత..

మేషం: ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. నిరుద్యోగులను

Advertiesment
daily astrology
, శుక్రవారం, 23 జూన్ 2017 (22:33 IST)
మేషం:
ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. 
 
వృషభం
స్త్రీలకు అధిక శ్రమ. దూరదేశాలు వెళ్లటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. రాజకీయాలలోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట వంటివి తప్పవు. 
 
మిథునం 
ఆర్థిక స్థితి ఆశించిన విధంగా మెరుగుపడకపోవడంతో నిరుత్సాహం తప్పదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఏ అవకాశం కలిసిరాక నిరుద్యోగులు ఆందోళన చెందుతారు. వీలైనంత మేరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. 
 
కర్కాటకం
సన్నిహితుల గురించి ఆందోళన చెందుతారు. ఎదుటివారు మీ నుంచి సమాచారం సేకరించేందుకు యత్నిస్తారు. ఉద్యోగస్తులతో తోటివారలతో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు విలాస వస్తువులు, ఆడంబరాల పట్ల మక్కువ పెరుగుతుంది. మీ అవసరాలకు సరిపడ ధనం సమకూర్చుకుంటారు. 
 
సింహం 
ఒక వ్యవహారం నిమిత్తం ఒకటికి పదిసార్లు యత్నించాల్సి ఉంటుంది. రహస్య విరోధులు అధికంకావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా రాబడి ఆశించినంతగా ఉండదు. శారీరకశ్రమ, విశ్రాంతిలోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్త్రీలకు పనివారితో సమస్యలు తప్పవు. 
 
కన్య
ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, ఒత్తిడి అధికం. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమంకాదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులెదుర్కొంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతుల్లో వ్యయం అధికమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
తుల
సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. రాజకీయ నాయకులకు ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికై చేయు కృషిలో పోటీ అధికమవ్వడంతో ఆందోళన తప్పదు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. 
 
వృశ్చికం
పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మార్కెట్ రంగాల వారికి లాభదాయకమైన అవకాశం కలిసివస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
ధనస్సు
విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి, సంతృప్తికానవస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
మకరం 
ఆర్థిక, వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచండి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. నూతన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించాలి. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యులలో ఒకిరికి వీడ్కోలు పలుకుతారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. 
 
కుంభం 
ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. బంధువులు మీ స్థితిగతులను చూసి అసూయపడే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. వ్యాపారాల అభివృద్ధికి కొత్తకొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. 
 
మీనం 
స్త్రీ కారణంగా మాటపడవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థల ఉద్యోగస్తులకు ఏకాగ్రత ఎంతో ముఖ్యం. నిరుద్యోగులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రముఖుల సహకారంతో ఒక సమస్య మీకు సానుకూలంగా పరిష్కారమవుతుంది. కుటుంబ అవసరాలు, ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాశి ఫలితాలు( 23-06-17)... మొహమాటాలకు, ఒత్తిళ్లకు తావివ్వొద్దు..