Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైత్రమాస అష్టమి.. దుర్గ, కాలభైరవ పూజతో విశేష ఫలితాలు..

Advertiesment
Chaitra Astami puja
Chaitra Astami puja
చైత్రమాసంలోనే కాదు.. ప్రతి నెల కృష్ణపక్ష 8వ రోజును అష్టమిగా పరిగణిస్తారు. ఈ రోజున రాహు కాలంలో దుర్గకు దీపం వెలిగించడం, అలాగే కాలభైరవునికి గుమ్మడి కాయతో లేదా కొబ్బరికాయతో దీపం వెలిగించడం ఈతి బాధలను దూరం చేస్తుంది. 
 
అష్టమి రోజున దుర్గకు భక్తులు అరటిపండు, దోసకాయ లేదా గుమ్మడికాయ వంటి కూరగాయలను సమర్పిస్తారు. ఈ అష్టమి రోజున 108 మట్టి దీపాలను వెలిగించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరుతాయి. 
 
ఇంకా దుర్గాదేవి అష్టోత్తర శతనామావళిని ఈ రోజున పఠించడం ద్వారా రుణబాధలు వుండవు. నరదృష్టి దూరమవుతాయి. దుర్గాదేవికి సంబంధించిన ఈ 108 నామాలు శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తాయి. ప్రతిరోజూ ఈ 108 నామాలను పఠించడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులతో పాటు, ఉత్సాహం, ఆనందం పెంపొందుతుంది. 
 
అలాగే కాలభైరవుడు, స్వర్ణ భైరవుడు.. ఇలా భైరవ రూపాలను అష్టమి రోజున పూజించడం.. మిరియాల దీపం వెలిగించడం, గుమ్మడి దీపం, కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇంకా కాలభైరవ అష్టకాన్ని ఈ రోజున పఠించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-04-2026 గురువారం ఫలితాలు - పోయానుకున్న వస్తువులు..?